వైద్య వృత్తిలో ఉండి రాజకీయాల్లో అడుగుపెట్టి విజయం సాధించినవారు ఎంతో మంది ఉన్నారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా సేవలు అందించినవారు.. ప్రస్తుతం అందిస్తున్నవారు కూడా ఉన్నారు.. ఇక, తాము ప్రయాణం చేస్తున్న సమయంలో.. తోటి ప్రయాణికులు అస్వస్థతకు గురైతే.. వెంటనే స్పందించి.. వారికి వైద్యం అందించి ప్రాణాలు నిలిపినవారు కూడా ఉన్నారు.. తాజాగా, వృత్తిరీత్యా డాక్టర్ అయిన కేంద్ర మంత్రి భగవత్ కరాడ్.. తోటి ప్రయాణికుడికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు.. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రిపై ప్రశంసలు కురిపించారు.
Read Also: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్.. ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరారు.. ఇండిగో విమానంలో ఆయన ప్రయాణం చేస్తున్న సమయంలో.. తన పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు.. తలనొప్పితో బాధపడ్డ ఆయన.. బీపీ లెవల్స్ కూడా పడిపోయాయి.. ఇది గమనించిన డాక్టర్ భగవత్ కరాడ్.. వెంటనే వైద్యం అందించాడు. గ్లూకోజ్ అందించడంతో సదరు ప్రయాణికుడు త్వరగా కోలుకున్నాడు. ఇక, ఈ ఘటనను సోషల్ మీడియా షేర్ చేసిన ఇండిగో యాజమాన్యం.. సదరు మంత్రికి ధన్యవాదాలు తెలిపింది.. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఎప్పుడూ ఆయన ఒక హృదయం ఉన్న డాక్టర్.. గొప్ప మనసున్న నా కొలీగ్ అంటూ ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ.
A doctor at heart, always!
— Narendra Modi (@narendramodi) November 16, 2021
Great gesture by my colleague @DrBhagwatKarad. https://t.co/VJIr5WajMH