Bhatti Vikramarka: త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం..
- ప్రజావాణిపై ప్రతి 3 నెలలకు ప్రణాళిక శాఖ సమీక్ష- డిప్యూటీ సీఎం
- ప్రభుత్వ పాలసీల్లో మార్పులు చేయాల్సి ఉండే రాతపూర్వక నివేదిక ఇవ్వండి- భట్టి విక్రమార్క
- త్వరలో నిర్ణయం తీసుకొని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం- డిప్యూటీ సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజావాణి ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం సచివాలయంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజావాణి పనితీరుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విధానాల్లో ఏవైనా మార్పులు చేయాలని ప్రజావాణి అధికారులు భావిస్తే వాటిని రాతపూర్వకంగా ప్రభుత్వానికి నివేదించాలని పేర్కొన్నారు. ఇందులో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులు, అవి పరిష్కరిస్తున్న తీరును డిప్యూటీ సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, వివిధ ప్రభుత్వ శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం సందర్భంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్పందిస్తున్న తీరును అధికారులను విచారించారు.
Waqf board: వక్ఫ్ బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం.. కేంద్రం యోచన.!
Also Read
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
ఫిర్యాదు గారు తన సమస్య పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకునేందుకు ఏ రకమైన వ్యవస్థ ప్రజావాణిలో ఉన్న అంశంపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఫిర్యాదు మొదట దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఎస్ఎంఎస్ (SMS) పంపిస్తామని, సమస్య పరిష్కారం అయిన తర్వాత చివరగా మరొక ఎస్ఎంఎస్ మొబైల్ కు పంపిస్తామని ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ సమావేశంలో వివరించారు. ఫిర్యాదు పరిష్కారం ఏ దశకు చేరిందనే అంశం తెలుసుకునే వ్యవస్థ ప్రస్తుతం లేదని ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ధరణికి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు నోడల్ అధికారి దివ్య దేవరాజన్ సమావేశంలో వివరించగా.. రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. త్వరలో నిర్ణయం తీసుకొని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.
Tragedy: విషాదంగా మారిన విహారయాత్ర.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
రేషన్ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలు పొందేందుకు వేరువేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని త్వరలోనే నిర్ణయం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. కొత్త పెన్షన్లను సైతం త్వరలో మంజూరు చేసే అవకాశం ఉందని చెప్పారు. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తే ప్రయోజనం లేదు వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అందుకు అవసరమైతే ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. అన్ని ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ డెస్క్ లను బలోపేతం చేసేలా చర్యలు చేపడితే సీఎంఆర్ఎఫ్ కు సంబంధించి ఫిర్యాదులు తగ్గిపోతాయని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. జీరో విద్యుత్ బిల్లు దరఖాస్తులు తీసుకునే మండల స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు. ప్రజావాణి విభాగంలో పనిచేసేందుకు పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని నోడల్ అధికారి దివ్య కోరగా డిప్యూటీ సీఎం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!