అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో.. భారీగా పతనమైన క్రూడాయిల్ ధరలు.. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. కానీ, ఇప్పుడు మళ్లీ కిందికి దిగివస్తున్నాయి.. బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర పీపాకు 3 శాతానికి పైగా తగ్గి ఈ ఏడాది మే నెల కనిష్ఠ స్థాయి 66 డాలర్లకు జారుకుంది క్రూడాయిల్ ధర… దీనికి కారణం.. అమెరికాతోపాటు పలు దేశాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో ఇంధన గిరాకీ మళ్లీ తగ్గినట్టుగా చెబుతున్నారు.. అమెరికా డాలర్ బలోపేతంతో పాటు ఆ దేశంలో ఇంధన నిల్వలు పెరగడం కూడా మరో కారణంగా చెబుతున్నారు.. ఇక, దేశీయంగా చూస్తే, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో ముడి చమురు పీపా సెప్టెంబరు డెలివరీ కాంట్రాక్టు ధర రూ.166 తగ్గి రూ.4,708గా నమోదైంది.. కాగా, కరోనా కల్లోలం సృష్టించిన సమయంలో… లాక్‌డౌన్ల కారణంగా ముడిచమురు ధరలు భారీగా పతనం అయిన సంగతి తెలిసిందే.