దేశంలో కరోనా, ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. ఆరు నెలల కాలం నుంచి కనిష్టంగా నమోదవుతున్న కేసుల్లో అనూహ్యంగా వేగం పుంజుకుంది. వారం రోజుల నుంచి క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల అలజడితో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండగా, అదే బాటలో ఇప్పుడు చెన్నై కూడా పయనిస్తున్నది. గత రెండు మూడు రోజుల నుంచి కేసులు క్రమంగా పెరుగుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. చెన్నై కార్పోరేషన్‌లో మొత్తం 39,537 వీధులు ఉండగా అందులో 507 వీధుల్లో కరోనా కేసులు నమోదవుతున్నట్టు అధికారులు గుర్తించారు.
Read: ముంబైని భయపెడుతున్న కోవిడ్…థర్డ్‌వేవ్ మొదలైనట్టేనా…!!?
వీధిలో మూడు కరోనా కేసులు నమోదైతే ఆ వీధిని కంటోన్మెంట్ జోన్‌గా మార్చేస్తున్నారు. మైక్రో కంటోన్మెంట్ జోన్ల ఏర్పాటు చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని తమిళనాడు ఆరోగ్యశాఖ భావిస్తున్నది. కేసుల పెరుగుదలను బట్టి కంటైన్మెంట్ జోన్లను పెంచుతామిన తమిళనాడు వైద్యారోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. తమిళనాడులో నైట్‌కర్ఫ్యూ అమలుపై డిసెంబర్ 31 వ తేదీన నిర్ణయం తీసుకుంటారని మంత్రి సుబ్రమణియన్ తెలియజేశారు.