దేశంలో కరోనా, ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. ఆరు నెలల కాలం నుంచి కనిష్టంగా నమోదవుతున్న కేసుల్లో అనూహ్యంగా వేగం పుంజుకుంది. వారం రోజుల నుంచి క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల అలజడితో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండగా, అదే బాటలో ఇప్పుడు చెన్నై కూడా పయనిస్తున్నది. గత రెండు మూడు రోజుల నుంచి కేసులు క్రమంగా పెరుగుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ…