భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా 'ఇన్‌కొవాక్'ను బూస్టర్ డోస్‌గా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత అనుమతి ప్రకారం ఇప్పటివరకు రెండు డోసుల కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారు 6నెలల తర్వాత బూస్టర్ డోస్‌గా ఈ చుక్కల మందు టీకా తీసుకోవచ్చు.
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే విస్తృతంగా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ టీకాలు పంపిణీ జరగగా.. మరోవైపు బూస్టర్ డోస్ పంపిణీపై కూడా ఫోకస్ పెట్టింది కేంద్రం.. ఇప్పటివరకు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు మరియు 60+ ఏజ్ గ్రూప్ వారు ఇలా 2.4 కోట్ల కంటే ఎక్కువ మందికి బూస్ట్ డోస్ పంపిణీ జరగగా.. ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. అందరికీ వ్యాక్సిన్ అందించాలనే నిర్ణయానికి…