విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది : సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయని, వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించండని కోరారు. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వండని, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ‘గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్రాల్లో రేషన్ లబ్ధిదారుల గుర్తింపుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదు.
Also Read
వెంటనే సరవణలు చేయాలి’ అని ఆయన కోరారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతుండగా.. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సహా లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు, అధికారులు హాజరు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ లతో పాటు ఇత రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశారా?
-
India ODI Squad vs England: కోహ్లీకి ఫిట్నెస్ షరతు, బుమ్రా రీఎంట్రీ.! ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..
-
Honda ADV 160: హోండా ADV 160 వచ్చేస్తోంది.. అడ్వెంచర్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు
-
Bollywood : సినీ ఫక్కీలో లేడిప్రొడ్యూసర్ ‘డైమండ్ ఇయర్ రింగ్స్’ కొట్టేశారు
-
The Paradise : ఇంటెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్… ‘ది ప్యారడైజ్’పై బజ్ పెంచే అప్డేట్
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!