కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో తిరుపతి తాజ్‌మహల్ హోటల్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ అధ్యక్షత వహించారు. అంతేకాకుండా ఈ సమావేశానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ లతో పాటు ఇత రాష్ట్రాల మంత్రులు, అధికారులు హజరయ్యారు. ఆయా రాష్టాల సమస్యలు, విజ్ఞప్తులను అమిత్ షా విన్నారు. ఏపీకి సంబంధించి ఏడు కీలక అంశాలను జగన్…
తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయని, వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి…
రేణిగుంట ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనడానికి ఏపీ సీఎం జగన్ తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకున్న జగన్.. తన కాన్వాయ్‌లో తిరుపతికి బయలుదేరారు. అయితే అలా మొదలై సీఎం కాన్వాయ్ వెంబడి ఓ మహిళ పరిగెత్తుతూ వచ్చింది. ఇది గమనించిన సీఎం జగన్ కాన్వాయ్‌కి నిలిపివేయించి.. ఓఎస్డీని ఆ మహిళ దగ్గరకు పంపించారు. అంతేకాకుండా ఆ మహిళ…