పెగాసస్‌పై సీజేఐ కీలక వ్యాఖ్యలు.. సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర వివాదానికి దారి తీసిని పెగాసస్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. పెగాసస్‌పై సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.. కమిటీకి సంబంధించి వచ్చేవారం ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది సుప్రీంకోర్టు.. భారత పౌరులపై నిఘా కోసం ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి.. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. కాగా, ఇజ్రాయెల్ సాఫ్ట్‌వేర్‌ను తమ ఏజెన్సీలు ఉపయోగిస్తున్నాయో లేదో బహిరంగపరచడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో కోర్టు సెప్టెంబర్ 13 న ఈ కేసులో తన ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది. గత విచారణ సమయంలో.. కేంద్ర ప్రభుత్వం.. తన ఏజెన్సీల ద్వారా పెగాసస్ వినియోగంపై సమాచారం పంచుకోవడానికి.. పిటిషనర్లను అడ్డుకోవడానికి నిర్దిష్ట సమాచారాన్ని అందజేయడానికి నిరాకరించింది.
ఇక, న్యాయమూర్తులు సూర్య కాంత్ మరియు హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం, న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేయడం మరియు స్వతంత్ర విచారణకు సంబంధించిన ఇతర అనుబంధ అంశాలపై రాబోయే 3-4 రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయనుంది.. అయితే, పెగాసస్ వ్యవహారంలో ఆగస్టు 16న ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌కు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. పెగాసస్ వంటి నిర్దిష్ట సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించడంపై.. అఫిడవిట్ లేదా బహిరంగ చర్చకు సంబంధించిన అంశం కాదని పునరుద్ఘాటించారు. మంత్రులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కార్యకర్తలు మరియు జర్నలిస్టుల ఫోన్‌లను హ్యాక్ చేయడానికి మిలిటరీ గ్రేడ్ స్పైవేర్‌ని ఉపయోగించడాన్ని ఈ అఫిడవిట్ ధృవీకరించలేదు.. ఇదే సమయంలో తిరస్కరించని సంగతి కూడా విదితమే. అయితే, ఇవాళ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ ఎన్వీ రమణ. పెగాసస్ స్నూపింగ్ వ్యవహారంలో విచారణకు సుప్రీం కోర్టు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు..
Also Read
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!