Cinema Functions: అభిమానుల ప్రాణాలు తీస్తున్న సినిమా ఫంక్షన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cinema Functions: ప్రి-రిలీజ్ ఈవెంట్.. ఆడియో లాంఛ్.. సక్సెస్ టూర్.. ఫొటో షూట్.. ఫొటో సెషన్.. పేరేదైనా సినిమా ఫంక్షన్లు అభిమానుల ప్రాణాలు తీస్తున్నాయి. మూవీలకు మార్కెట్‌లో హైప్ క్రియేట్ చేయటం కోసం అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఫ్యాన్స్‌ను బలిగొంటున్నాయి. కొన్నిసార్లు అభిమానులకు తీవ్ర గాయాలతో చావు తప్పి కన్ను లొట్ట బోతోంది. దీనికి తాజా ఉదాహరణ ‘బింబిసార’ మూవీ ప్రీ-రిలీజ్ ప్రోగ్రాం. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఈవెంట్ మొన్న శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగింది.
ఇందులో పాల్గొన్న పుట్టా సాయిరాం అనే యువకుడు మూర్ఛ (ఫిట్స్) రావటంతో చనిపోయాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇతణ్ని కొండాపూర్‌లోని శిల్పకళా వేదిక నుంచి సమీప ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలా జరిగాయి. గతేడాది డిసెంబర్‌లో ఫొటోషూట్‌కి స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్ వస్తున్నాడనే ప్రచారంతో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్లను కంట్రోల్ చేయటానికి పోలీసులు లాఠీఛార్జ్‌కి దిగాల్సి వచ్చింది.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
Women: ‘ఆమె’కు వందనం. అవయవదాతల్లో 80 శాతం ఆడవాళ్లే. గ్రహీతల్లో 20 శాతమే. ఎందుకిలా?
అదే నెలలో ప్రభాస్ చిత్రం రాధేశ్యామ్ ప్రిరిలీజ్ ఈవెంట్‌లో కనీసం ముగ్గురు ఫ్యాన్స్ గాయాల బారినపడ్డారు. ప్రిన్స్ మహేష్‌బాబు పాల్గొన్న ఫొటో సెషన్‌కి అభిమానులు అనూహ్యంగా తరలివచ్చారు. ఆ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో కొంతమంది యువకులకు స్వల్పంగా, ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కర్నూల్ ఎమ్మిగనూర్‌లోని ఓ థియేటర్‌లో ‘గోవిందుడు అందరివాడేలే’ ఫిల్మ్ టికెట్ తీసుకునేందుకు జనం క్యూలో నిలబడ్డప్పుడు జరిగిన తోపులాటలో ఓ వ్యక్తి కన్నుమూశాడు.
వరంగల్‌లో జూనియర్ ఎన్టీఆర్ పిక్చర్ ‘బాద్షా’ ఆడియో లాంఛ్ సందర్భంగా తొక్కిసలాట జరిగి ఓ వీరాభిమాని ప్రాణాలు కోల్పోయాడు. ప్రభాస్ మరో సినిమా ‘మిర్చి’ ఆడియో విడుదలప్పుడూ పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. సినిమా విడుదల సందర్భంగా బ్యానర్లు కడుతూ కరెంట్ షాక్‌తో చనిపోయిన సందర్భాలూ ఉన్నాయి. కనీసం ఏడాదికొకటైనా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనికి ఏ ఒక్కరినో తప్పుపట్టాల్సిన పనిలేదు. ఒక్కోసారి ఈవెంట్ ఆర్గనైజర్లు పరిమితికి మించి పాసలు ఇస్తున్నారు. ఒక్కోసారి ఫ్యాన్స్ పిచ్చి అభిమానంతో ఎగబడుతున్నారు.
అదే సమయంలో సెక్యూరిటీ లోపాలూ బయటపడుతున్నాయి. హీరోలు, నిర్మాతలు, దర్శకులు ప్రచారం, అభిమానగణ ప్రదర్శన కోసం పాకులాడటమూ ప్రమాదాలకు దారితీస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఒకటీ రెండు చోట్లే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తే ప్రేక్షకుల తాకిడిని తట్టుకోవచ్చని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇకనైనా ప్రాణనష్టం జరక్కుండా చూస్తారని ఆశిస్తున్నారు. ‘బింబిసార’ టైంలో భారీ వర్షం వచ్చింది. దీంతో అటుగా వెళ్లేవాళ్లు శిల్పకళా వేదిక వద్దకు చేరుకున్నారు. ఫలితంగా ఆ ఆడిటోరియం నుంచి అభిమానులు బయటికి రావటానికి వీల్లేకుండా పోయిందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!