ప్రధాని మోడీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ది కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సభ్యులతో పాటే కొద్ది సేపు కూర్చున్నారు. అనంతరం పాటల కార్యక్రమంలో పాల్గొన్నారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. వేడుకల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, చట్ట పరిమితులను అతిక్రమించినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నుండి నూతన సంవత్సర వేడుకల వరకు కొనసాగేలా భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. Waste-to-Energy: వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు – ఏపీ డిస్కం మధ్య కుదిరిన ఎంవోయూ ముఖ్యంగా పబ్బులు, హోటళ్ల…
స్టార్ హీరోయిన్ శ్రుతీ హాసన్ క్రిస్మస్ సీజన్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సెలబ్రేషన్స్ ద్వారా కొత్త సంవత్సరాదిని సరికొత్త ఉత్సుకతలో ప్రారంభించటానికి ఆమె అడుగులు వేస్తోంది. క్రిస్మస్ పండుగను శ్రుతీ హాసన్ తనదైన శైలిలో జరుపుకోవటానికి సెలబ్రేషన్స్‌ను మొదలు పెట్టింది. అందులో భాగంగా గోత్ థీమ్‌తో క్రిస్మస్‌ను సెలబ్రేట్ చేయటానికి తన స్టైల్‌ను జోడించింది శ్రుతీ హాసన్. తనదైన స్టైల్లో యూనిక్‌గా నిర్వహిస్తోన్న క్రిస్మస్ పండుగ వేడుకలకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్…
Christmas Celebrations: తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో చర్చిలు వెలిగిపోతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలతో చర్చిలు కిటకిటలాడుతున్నాయి.
తెలంగాణలో కులమత సంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయని.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతతో పాటు యోగాసనాలు ఫాలో అవ్వాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో క్రిస్‌మస్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అధిక సంఖ్యలో క్రిస్టియన్ సోదరి, సోదరిమణులు పాల్గొన్నారు.
సర్వమతాలకు రక్షణగా ఉండాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి.
తోటి మనుషులను ప్రేమించాలని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి పేదలకు చేయూతను అందించి పైకి తీసుకురావాలి.. సంఘంతో జీవించాలి అన్న క్రీస్తు బోధనలకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ, పేదలకు చేయూతనిస్తూ అభివృద్ధిలోకి తీసుకొస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రైస్తవ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు.
సెలెబ్రేటీలు అంటే లైఫ్ అంతా జిగేల్ మంటుంది.. అత్యంత ఖరీదైన లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు.. వాళ్లు వేసుకొనే డ్రెస్సుల నుంచి చెప్పుల వరకు ప్రతిదీ టాప్ బ్రాండెడ్ వే వేసుకుంటారు.. ఇటీవల సెలెబ్రేటీల లగ్జరీ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.. తాజాగా ఉపసాన డ్రెస్ కాస్ట్ అలాగే వైరల్ అవుతోంది. సాధారణంగా లో కాస్ట్ దుస్తులు ధరించడానికి ఇష్టపడరు. సెలబ్రెటీల డ్రస్సులు, షూస్ , వాచ్ ఇలా అన్ని చాలా కాస్ట్లీగా ఉంటాయి.…
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సచివాలయంలో క్రిష్టియన్ ఎంప్లాయిస్ అసోసియన్ ఆధ్వర్యంలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంగా, ఆనందంగా జరుపుకునే పండుగని అన్నారు. విద్య, వైద్య రంగాలలో కొనియాడదగిన సేవలను క్రైస్తవులు…