సాధారణంగా చైనా ప్రొడక్ట్స్ గురించి ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. అదే తరహాలో చైనాకు కూడా భద్రతాపరమైన భయం పట్టుకుంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్లు సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్ ఫోన్లూ వాడొద్దని చైనా తమ ఉద్యోగులకు సూచించినట్లు తెలుస్తోంది.
China Corona: కరోనాకు పుట్టినిల్లు చైనాలో మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. వరుసగా రోజుకు 40వేలకు పైగా పాజిటివ్ కేసులు అక్కడ వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎన్ని ఆంక్షలు అమలు చేస్తోన్న వైరస్ వ్యాప్తి కొనసాగుతోనే ఉంది.
తమ దేశంలో జనాభా పెరుగుదలకు చైనా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా వివాహం చేసుకున్న దంపతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దంపతులు పిల్లల్ని కంటే ‘బేబీ లోన్’ పేరుతో రూ.25 లక్షలు వరకు బ్యాంకు రుణం ఇప్పిస్తామని చైనాలోని జిలిన్ ప్రావిన్స్ వెల్లడించింది. పిల్లల సంఖ్యను బట్టి వడ్డీ రేట్లలో డిస్కౌంట్లు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఒకవేళ అప్పటికే పిల్లలు ఉన్న దంపతులు ఏదైనా వ్యాపారం చేస్తుంటే పన్నులో మినహాయింపు…
చైనా మరోసారి తన విస్తరణవాదానికి తెర లేపింది. తైవాన్ గగనతలంలోకి యుద్ధ విమానాలు పంపి ఉద్రిక్తత వాతావరణం సృష్టించడానికి చూస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి చైనా తైవాన్‌ను రెచ్చగొడుతుంది. ఇదే వారంలో రెండు సార్లు చైనా, తైవాన్ ఎయిర్ ఢిపెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌లోకి విమానాలను పంపింది చైనా. తాజాగా 13 విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపి చైనా వక్రబుద్ధిని మరోసారి నిరూపించుకుంది.వీటిలో కంట్రోల్ (AEW&C) విమానం,ఆరు షెన్యాంగ్ J-16 మరియు రెండు చెంగ్డు J-10 ఫైటర్ జెట్‌లు…
హెలికాప్టర్ ప్రమాదంపై ఎగతాళి వ్యాఖ్యలుచైనా కనీస మానవత్వం మరిచిపోయి మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. సంయమనంతో స్పందించాల్సిన సందర్భంలో అవాకులు చెవాకులు పేలింది. చీఫ్‌ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్‌రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం పై చైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. భారత సైన్యానికి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత లేదని వ్యాఖ్యానించింది. భారత సైన్యం ఆధునికీకరణకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించింది. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ మీడియా సంస్థ…
ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులపై హోం వర్క్ భారం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పిల్లలపై హోంవర్క్ భారం తగ్గించేందుకు చైనా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని కోసం కొత్త చట్టం తీసుకురావాలని యోచిస్తోంది. ఈ చట్టం ద్వారా తీసుకురాబోయే నిబంధనలను అమలు చేసే బాధ్యతను స్థానిక అధికార యంత్రాంగానికి అప్పగించాలని చైనా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పిల్లలకు హోంవర్క్ తగ్గించడమే కాకుండా పిల్లలకు సరిపడా విశ్రాంతి లభించేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని ఈ చట్టం ద్వారా…