MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు.. ఈసీకి చంద్రబాబు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలపై సీఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ నేతలతో పలు చోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కుతో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదయ్యాయని అని ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను లేఖకు జత చేశారు చంద్రబాబు. బోగస్, నకిలీ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోందపి చంద్రబాబు అన్నారు. గతంలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో కూడా బోగస్ ఓట్ల తంతు నడిచిందని గుర్తు చేశారు. పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేడు అదే పునరావృతం అవుతుందని చంద్రబాబు ఆరోపించారు. డిగ్రీ చదవని వ్యక్తులు, నకిలీ సర్టిఫికేట్లతో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. తప్పుడు చిరునామాలతో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చారని చెప్పారు.
Also Read:YSRCP: వైఎస్ఆర్సీపీకి 13 ఏళ్లు.. ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తిరుపతిలో ఒకే ఇంటి చిరునామాతో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్పించారని వివరించారు. ఎన్నికల అధికారులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో ఓటర్లుగా చేరారని ఆరోపించారు. కొందరు అధికారులు నకిలీ పత్రాలను పరిశీలించకుండానే, ఉద్దేశ్య పూర్వకంగానే ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. తిరుపతిలో 44వ డివిజన్లో చికెన్ దుకాణం అడ్రస్సుతో కూడా 16 బోగస్ ఓట్లు నమోదు చేశారని చెప్పారు. ఇలా పలు ప్రాంతాల్లో బోగస్ ఓట్ల తంతు ఉందన్నారు. బోగస్ ఓట్లపై విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ బోగస్, నకిలీ ఓట్లతో ప్రజాస్వామ్య విలువలకు, ప్రాథమిక హక్కులకు తీవ్ర నష్టం అని పేర్కొన్నారు. తక్షణ చర్యలు తీసుకుని.. అక్రమాలను అడ్డుకోవాలని కోరారు. బోగస్ ఓట్ల నమోదులో పాల్గొన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా ఆదేశాలివ్వాలని చంద్రబాబు లేఖలో కోరారు.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
కాగా, ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!