Actor Innocent: సినీ ఇండస్ట్రీలో విషాదం… నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ తదితర పరిశ్రమలో ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖ నటులు కన్నుమూశారు. తాజాగా ప్రముఖ మలయాళ సినీ నటుడు, లోక్‌సభ మాజీ ఎంపీ ఇన్నోసెంట్ మరణించారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. గతకొద్ది రోజులుగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కరోనా సోకడంతోపాటు శ్వాసకోశ వ్యాధులు, వివిధ అవయవాల వైఫల్యం వల్ల ఇన్నోసెంట్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Also Read:Sri Shiva Stotra Parayanam: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే వాహన ప్రమాదాలు తొలగిపోతాయి
ఇన్నోసెంట్‌కు 2012లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మూడేళ్ల తర్వాత, అతను ఆ వ్యాధిని అధిగమించానని ప్రకటించాడు. క్యాన్సర్‌తో తన యుద్ధం గురించి తన పుస్తకం ‘లాఫ్టర్ ఇన్ ది క్యాన్సర్ వార్డ్’లో రాశాడు. నటుడు ఇన్నోసెంట్లోక్సభ ఎంపీగా కూడా సేవలందించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇన్నోసెంట్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఇన్నోసెంట్ తన ప్రత్యేకమైన నటనా శైలితో ప్రజల హృదయాలను కొల్లగొట్టారని కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా ఇన్నోసెంట్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆయన అద్భుతమైన, ప్రతిభావంతుడైన నటుడని కొనియాడారు.
Also Read
Mourning the loss of character actor, comedian & one-time Kerala MP Innocent, who has just passed away at age 75. Aside from being a brilliantly inventive & gifted actor, he was a fine human being whom it was a pleasure to interact with in the Lok Sabha. RIP. Om Shanti. pic.twitter.com/m9mFGI8DwM
— Shashi Tharoor (@ShashiTharoor) March 26, 2023
రాజకీయాల్లోనూ ఇన్నోసెంట్ చాలా చురుగ్గా ఉండేవారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇన్నోసెంట్ త్రిసూర్ జిల్లాలోని చలకుడి నియోజకవర్గం నుంచి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 2014-2019 వరకు లోక్‌సభ ఎంపీగా కూడా సేవలందించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి బెన్నీ బెహనాన్ చేతిలో ఓడిపోయారు.
Also Read:TSRTC: రోడ్డెక్కుతున్న లహరి బస్సులు.. అదిరిపోయే ప్రత్యేకలు ఇవే..
1948లో ఇన్రింజలకుడలో జన్మించిన ఇన్నోసెంట్ 1972లో ప్రేమ్ నజీర్, జయభారతి జంటగా నటించిన ‘నృత్యశాల’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అతను వరుసగా 12 సంవత్సరాలు మలయాళ కళాకారుల సంఘం అయిన అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ప్రముఖ నటుడు, హాస్యనటుడిగా ప్రేమగా గుర్తుంచుకుంటారు. నాలుగు దశాబ్దాలు పాటు నటించిన ఆయన.. దాదాపు 500 చిత్రాలకు పైగా నటించారు. ఆయన చివరిసారిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘కడువ’లో కనిపించారు. ఈ చిత్రం 2022లో విడుదలైంది.
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!