కోవిడ్ -19 వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తులపై భారతదేశం, విదేశాలలో నిర్వహించిన అధ్యయనాలలో కొన్ని సాధారణ అంశాలు వెలువడ్డాయి. ఆసుపత్రిలో చేరినా.. ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటున్న, మిశ్రమ పద్ధతుల ద్వారా కోలుకున్న రోగులలో అలసట అనేది చాలా తరచుగా వస్తుందట.
దేశంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.