ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బంది పడుతోన్న ప్రజలకు తక్కువ ధరకే వంట నూనెలు అందిస్తోంది.. ఇవాళ్టి నుంచి వంట నూనె ధరలు తగ్గించి అమ్మాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. కిలో పామాయిల్ రూ. 110, సన్ ఫ్లవర్ నూనె రూ.124కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో వంట నూనెలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో భారత్‌లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పలు చోట్ల వ్యాపారులు దొరికిందే సందు అని నూనె ప్యాకెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వంట నూనెలను ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారి శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. పాత స్టాక్ విషయంలో వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని…
ఎక్కడ ఏది జరిగినా.. దాని ప్రభావం మనపై పడే అవకాశం ఉందనే చర్చ సాగిందంటే చాలు.. వెంటనే బ్లాక్‌మార్కెట్ దారులు మేల్కొంటున్నారు.. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి ప్రజలకు షాక్ ఇస్తున్నారు.. అయితే, సన్ ఫ్లవర్, పామాయిల్, వేరుశనగ నూనెలు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈ ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతు బజార్లో కొన్ని కౌంటర్లు పెట్టనున్నారు. మొబైల్ వాహనాల్లో కూడా ఆయిల్ విక్రయించనున్నారు. స్వయం సహాయక…
వంట గదిలో కుంపటి పెడుతున్నాయి వంట నూనెల ధరలు.. అమాంతం పెరిగిపోయిన వంట నూనెల ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి… పెట్రో ధరలు, గ్యాస్ బాదుడుకు తోడు వంట నూనెల ధరల ప్రభావం అందరిపై పడుతోంది.. అయితే, పండుగల వేళ వినియోగదారులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక, వంటనూనెలపై ఉన్న అగ్రిసెస్‌ను కూడా తగ్గించింది కేంద్రం.. దీంతో దేశీయంగా వంట…