తెలంగాణ ఇవాళ్టి నుంచి లాక్ డౌన్ సమయం తగ్గనుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు ఉండనున్నాయి. దీంతో తెలంగాణలో నేటి నుంచి ఆర్టీసీ సర్వీసులు సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని జిల్లాలకు ఆర్టిసి బస్సు సర్వీసులను నడుపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నేటి నుంచి తెలంగాణలో 3,600 బస్సులు నడుస్తున్నాయని, అటు హైదరాబాద్ లో ఏకంగా 800 సిటీ బస్సులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా నిన్నటి వరకు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే బస్సు నడిచేవి. ఇప్పుడు ఆ సమయం పెరిగింది. ఇక అటు మెట్రో ప్రయాణికులకు కూడా భారీ ఊరట లభించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రైలు సాయంత్రం 6 గంటల వరకు ఇక నుంచి నిర్విరామంగా తిరగనున్నాయి. చివరి రైలు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరి స్టేషన్ కు 6 గంటల వరకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు.