CM YS Jagan: ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య అనేక విషయాలపై ప్రచారం సాగుతోంది.. ఓవైపు ముందస్తు ఎన్నికలకు వెళ్తారని.. మరోవైపు కేబినెట్ విస్తరణ ఉందని.. ఎప్పుడైనా జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని.. ఇలా అనేక అంశాలపై రూమర్స్ వస్తున్నాయి.. అయితే, గడప గడపకు మన ప్రభుత్వంపై చేపట్టిన సమీక్షా సమావేశంలో వీటిపై క్లారిటీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. ఏపీలో రాజకీయ పరిణామాలపై రూమర్లను కొట్టిపారేసిన ఆయన.. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు ఉంటాయన్నారు.. మంత్రుల మార్పు సహా ఇతర రూమర్ల పై ఎమ్మెల్మేలతో చర్చించిన ఆయన.. రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు చాలా వస్తాయని.. వాటిని తిప్పికొట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గడపగడపకూ కార్యకర్రమంపై సమీక్ష జరిగింది.. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, ఇతర నేతలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశాం.. దాని తర్వాత కార్యక్రమానికి కాస్తగ్యాప్ వచ్చింది.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గ్యాప్ వచ్చిందని.. మార్చి 16వరకూ కోడ్ కొనసాగింది.. తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.. తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి.. దీనివల్ల గడపగడపకూ కాస్త గ్యాప్ వచ్చిందన్నారు సీఎం..
అయితే, మళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు సీఎం జగన్.. గేర్ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలన్న ఆయన.. రాష్ట్ర చరిత్రే కాదు.. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే.. రూ.2లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్‌లో పడిందన్నారు. అర్బన్ ప్రాంతంలో 84శాతం, రూరల్ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, యావరేజీన 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం.. ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదన్నారు. 87 శాతం కుటుంబాలను గమనించినట్టైతే.. అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశామని.. పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్ చేసిన మరీ.. వారికి పథకాలు అందిస్తున్నాం.. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చామని తెలిపారు.
Also Read
బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు. ఇచ్చాం.. ఇలా, చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం అని తెలిపారు సీఎం జగన్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు.. 21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే, 17 స్థానాల్లో మనం గెలిచాం.. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం అన్నారు.. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు.. కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి.. ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి.. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు.. అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుందని.. ఆ పరిధిలో 87శాతం అంటే అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయని.. అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదు చేసుకున్నారు.. వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందిన వారు.. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికైతే మంచి చేశామో.. వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువగా ఉన్నారని.. ఎమ్మల్సీ ఎన్నికల్లో ఓటర్లైన ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో దాదాపు 80 శాతం మంది డీబీటీలో లేనివారు.. కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నారని.. ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపిల్ ఏదైతే.. ఉందో.. అది ఇది కాదు.. ఒకటి, రెండో, మూడో ప్రాధాన్యాలు ఉన్నాయి.. మిగిలిన పార్టీ అందరూ కలిశారు.. మనం ఒక్కరమే.. అయినా తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలవ లేదన్నారు సీఎం జగన్.. ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి.. జరిగింది.. అయినా కూడా ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారు.. దానికితోడు కొన్ని మీడియా, ఛానెళ్లు చూపిస్తున్నాయి.. రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు.. 60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారు చేస్తున్నారని చెప్తారు.. ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు.. ఇంతకంటే.. దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు.. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారు.. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి.. అందుకే అంటున్నా.. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం.. వారంతా గజ దొంగల ముఠా.. దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం వచ్చాక గండిపడింది… అందుకే గజ దొంగల ముఠా ఇవన్నీ చేస్తున్నాయి.. రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి.. వాటిని తిప్పికొట్టాలి.. సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం.. కేడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి.. సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి.. సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలని కీలక ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
తాజావార్తలు
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!