తెలంగాణలో ఈరోజు నుంచి బతుకమ్మ పండగ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి ఏడాది బతుకమ్మ పండగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. గతేడాది కరోనా కారణంగా ఈ వేడుకలను సాదాసీదాగా నిర్వహించారు. అయితే, కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటంతో ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 9 రోజులపాటు ఈ వేడుకలు జరగబోతున్నాయి. తొలిరోజు ఎంగిలిపూలతో బతుకమ్మ పండుగ మొదలయ్యి చివరిరోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు పరిసమాప్తమవుతాయి. ప్రతీ ఊరిలోనూ బతుకమ్మల కోసం మైదానాలు చెరువులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేసేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Read: అక్టోబర్ 6, బుధవారం దినఫలాలు