సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. హజ్ యాత్రకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై 20 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ప్రయాణీకుల బస్సు వంతెనపై ఢీకొని, బోల్తా పడింది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది.
Also Read:Young Man Died While Dancing In Wedding: ప్రాణాలు తీస్తోన్న డీజేలు.. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు మృతి
సౌదీ అరేబియాకు నైరుతిలో ఉన్న అసిర్ ప్రావిన్స్‌లోని 14 కిలోమీటర్ల పొడవైన అకాబత్ షార్ రహదారిపై సాయంత్రం 4 గంటలకు బస్సు ఖమీస్ ముషైత్ నుండి అభాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ రహదారి పర్వతాల గుండా వెళుతుంది మరియు 11 సొరంగాలు మరియు 32 వంతెనలను కలిగి ఉంది. బస్సు బ్రిడ్జిపైకి వెళుతున్నప్పుడు బ్రేక్ ఫెయిల్యూర్ కావడంతో వంతెన చివర ఉన్న అడ్డంకిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనం బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మరో 29 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బస్సు ప్రమాదానికి గురికాగానే బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది.