ట్రైన్‌లో అండ‌ర్‌వేర్‌తో అధికారపార్టీ ఎమ్మెల్యే… అవాక్కైన ప్ర‌యాణికులు…

ఓ ఎమ్మెల్లే బీహార్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు.  అలా ట్రైన్‌లోకి ఎక్కిన తరువాత ఆయన హఠాత్తుగా అండ‌ర్‌వేర్‌, బనియన్ వేసుకొని బోగీలో తిరుగుతూ కనిపించారు.  వెంటనే తోటి ప్రయాణికులు ప్రశ్నించగా ఆయన విచిత్రమైన సమాధానం చెప్పారు.  త‌న‌కు క‌డుపు ఉబ్బరంగా ఉంద‌ని, వాష్‌రూమ్‌కు వెళ్లి వ‌స్తున్నాన‌ని స‌మాధానం చెప్పారు.  ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలా తిరిగితే ఎలా అని ప్ర‌యాణికులు ప్ర‌శ్నించారు.  అనంత‌రం ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వే సీపీఆర్‌వోకు ఫిర్యాదు చేశారు.  బీహార్ అధికార‌పార్టీ జేడీయు ఎమ్మెల్యే గోపాల్ మండ‌ల్  చేసిన ప‌నికి ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యేపై జేడియు చ‌ర్య‌లు తీసుకుంటుందా లేదా అన్న‌ది చూడాలి.  ప్ర‌స్తుతం ఎమ్మెల్యే  అర్థ‌న‌గ్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  

Read: మొన్న చైనా… ఇప్పుడు న్యూయార్క్‌…

Related Articles

Latest Articles

-Advertisement-