ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై చర్చించారు. అయితే, రెండు వారాల వ్యవధిలో సీఎం జగన్ మళ్లీ ప్రధానితో భేటీ అవుతుండడం ఆసక్తి రేపుతోంది.
Also Read:Regina Cassandra: పచ్చని చెట్ల మధ్య పూల పూల డ్రెస్ లో పువ్వులా మారిందే
ఏపీలో రాజకీయ పరిణామాలు వేడిగా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురు దెబ్బలు తగిలాయి. రాజధాని అమరావతి అంశంపై సుప్రీం కోర్టులో నిన్న విచారణ జరిగింది. విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టాలని సీఎం జగన్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇక, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి ఏదో ఒకటి తేలేలా ఉంది. ఈ అంశాలపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో సీఎం జగన్ చర్చిస్తారని అంచనా ఉంది. పోలవరం ఎత్తు గురించి కేంద్రం కీలక ప్రకటన కూడా చేసింది. ఈ క్రమంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.