ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. అయితే నిన్నటి కంటే ఇవాళ ఏపీలో కరోనా కేసులు తగ్గిపోయాయి. ఏపీ సర్కార్ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 18,561 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక మృతుల సంఖ్య సెంచరీ దాటేసి 24 గంటల్లో 109 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 17,334 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. రాష్ట్రం లో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,54,052 కి చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 12,33,017కి పెరిగింది.. కోవిడ్‌తో ఇప్పటి వరకు 9481 మంది మరణించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,11,554గా ఉంది.