AP: ఇవాళే కీలక భేటీ.. ఆ తర్వాత మంత్రులంతా రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో ఈ రోజు కీలక ఘట్టం జరగబోతోంది. మంత్రి మండలి రద్దు కానుంది.. సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో చివరి క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశం ప్రస్తుతం ఉన్న మంత్రులకు చివరిది అవుతుంది. కొత్తపేటకు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. సమావేశం అనంతరం మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పిస్తారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులకు సంకేతాలు అందటంతో చివరి సమావేశాలు అని బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ఇక, మంత్రులు ఇచ్చిన రాజీనామా పత్రాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గరకు స్వయంగా తీసుకుని వెళతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అదే సమయంలో కొత్త మంత్రి వర్గ జాబితాను గవర్నర్ కు అందజేస్తారు. మరోవైపు ఎవరికి తిరిగి బెర్త్ దక్కుతుంది? ఎవరికి కొత్తగా క్యాబినెట్ లో స్థానం లభిస్తుంది అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. మరోవైపు అశావహులు తీవ్ర ప్రయత్నాల్లో మునిగిపోయారు. వచ్చే రెండు మూడు రోజుల్లో కీలక పరిణామాలు జరగనుండడంతో వైసీపీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన సీఎం జగన్.. ప్రధాని మోడీ సహా పలువురు నేతల్ని కలిసి కీలక అంశాలపై చర్చించారు. విభజన హామీలు నెరవేర్చాలని కోరారు. ఇటు కొత్త జిల్లాల విషయాన్ని కూడా వారికి వివరించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి చర్చలు జరిపారు. హస్తిన నుంచి ఏపీకి చేరుకున్న తర్వాత.. నిన్న సాయంత్రం గవర్నర్‌ను కలిసి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు, మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి అపాయింట్‌మెంట్ కోరారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?