ఏపీ శీతాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నట్లు గవర్నర్ బిష్వభూషణ్ నోటిఫికేషన్ జారీ చేశారు. నాలుగైదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
అయితే 18న జరిగే బీఏసీ భేటీలో అసెంబ్లీ పని దినాలు, అజెండా ఖరారు కానున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఏపీ ప్రత్యేక హోదా లతో పాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రెండు సార్లు శీతాకాల సమావేశాల నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.