ఫిబ్రవరి రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సమావేశాలు 4 రోజుల నుంచి 5 రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో.. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ అంచనాలు తెప్పించుకుంది. కాగా.. ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావడంతో కీలక ప్రకటనలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ముందు…
ఈ నెల 18న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభలో తనను వ్యక్తిగతంగా దూషించారని చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి హోదాలోనే సభలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతరం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 9 గంటలకు మూడోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.ఇవాళ్టి నుంచి ప్రశ్నోత్తరాల సమయాన్ని అసెంబ్లీ చేపట్టనుంది. సభ ముందుకు ఏపీ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు సభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. మొదటి సభలోకి చంద్రబాబు రాకపోవడంతో కుప్పం ఫలితాల కారణంగా రాలేదని జగన్ వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ నేతలు చంద్రబాబును సభలోకి ఆహ్వానించారు. అయితే వైసీపీ మంత్రి కొడాలి నాని సభలో మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై చర్చించడానికి టీడీపీ ధైర్యం లేదని.. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అంతేకాకుండా ఇక్కడ రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నామని వేరే…
ఏపీ శీతాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నట్లు గవర్నర్ బిష్వభూషణ్ నోటిఫికేషన్ జారీ చేశారు. నాలుగైదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే 18న జరిగే బీఏసీ భేటీలో అసెంబ్లీ పని దినాలు, అజెండా ఖరారు కానున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఏపీ ప్రత్యేక హోదా లతో పాటు పలు కీలక…