గోవా ఎన్నిక‌లపై టీఎంసీ దృష్టి…

వ‌చ్చే ఏడాది దేశంలో 5 రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఐదు రాష్ట్రాల్లో గోవా కూడా ఒక‌టి.  దేశంలో బీజేపీని ఎలాగైనా ఓడించాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌తిప‌క్షాల‌న్ని క‌లిసిక‌ట్టుగా ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.  బెంగాల్ ఎన్నిక‌ల త‌రువాత దేశంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసే పార్టీలు ఒక్క‌టిగా క‌లిసి ప‌నిచేసుందుకు ముందుకు వ‌స్తున్నాయి.  కాగా గోవాలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీనంగా ఉండ‌టంతో బీజేపీకి ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిసి వ‌చ్చింది.  కాంగ్రెస్ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు ఆప్ ఇప్ప‌టికే రంగంలోకి దిగింది.  గోవా నుంచి పోటీచేసి బీజేపీని దెబ్బకొట్టాల‌ని చూస్తున్న సంగ‌తి తెలిసందే.  ఇప్పటికే ప్ర‌చారం కూడా షురూ చేసింది.  అయితే, ఇప్పుడు దీదీ తృణ‌మూల్ కూడా గోవాలో అడుగుపెట్టేందుకు సిద్ధం అయింది.  బెంగాల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్‌కు ప‌నిచేసిన ప్ర‌శాంత్ కిషోర్‌, ఇప్పుడు గోవాలో తృణ‌మూల్ త‌ర‌పున ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేస్తున్నారు.  త్వ‌ర‌లోనే తృణ‌మూల్ ఎంపీలు గోవాలో ప‌ర్య‌టించ‌నున్నారు.  అదేవిధంగా దీదీకూడా గోవాలో ప‌ర్య‌టించి బీజేపీపై విమ‌ర్శ‌నాస్త్రాలు చేసే అవ‌కాశం ఉన్న‌ది.  

Read: ఏపీ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

Related Articles

Latest Articles