క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రముఖ యాంకర్ లాస్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాలో తనకు వికృత అనుభవం ఎదురైందని.. ఓ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన తనను ఓ వ్యక్తి తనతో పడుకోమని అడిగాడని ఆరోపించింది. చాలా ఉన్నతమైన స్థాయిలో న్యూ జెర్సీలో స్థిరపడిన ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి చాలా పచ్చిగా అడిగాడని.. కానీ తాను కుదరదు అని చెప్పేశానని లాస్య తెలిపింది. ‘నాతో పెద్దపెద్ద యాంకర్లే పడుకున్నారు.. నువ్వెంత?’ అంటూ ఆ వ్యక్తి తనతో అసభ్యంగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also: ఒమిక్రాన్ ఎఫెక్ట్: హిందీ ‘జెర్సీ’ మళ్లీ వాయిదా
ఈవెంట్స్ కోసం అమెరికా వెళ్లిన హీరోయిన్లు అక్కడ కాసేపు మాత్రమే ఉంటారని… ఆ తర్వాత హోటల్ రూమ్స్‌కు వెళ్లిపోతారని… అప్పటి నుండి చాలా మంది వాళ్లను సీక్రెట్‌గా కలుస్తారని లాస్య తెలిపింది. అమెరికా పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఇలాంటి దిమ్మతిరిగిపోయే విషయాలు చాలా బయటకు వచ్చాయని లాస్య వివరించింది. సాంస్కృతిక కార్యక్రమాలకు యుఎస్ వెళ్లే గ్రూప్ మెంబర్స్‌తో పాటుగా అమెరికాలో ఉన్న వ్యాపారవేత్తలకు హీరోయిన్‌లను ఎరగా వేసి కొందరు భారీగా డబ్బులు సంపాదిస్తున్నారని లాస్య ఆరోపించింది. ఇండియాలోనే కాదు ఏకంగా అమెరికాలోనూ హైటెక్ వ్యభిచారం చేస్తున్నారని… ఈవెంట్స్ కోసం అమెరికాకు వెళ్లే మన హీరోయిన్స్ మాత్రమే కాదు.. యాంకరింగ్ చేసేందుకు వెళ్లే టాప్ యాంకర్స్ కూడా వ్యభిచారం రొంపిలోకి ఇరుక్కున్నారని లాస్య సంచలన ఆరోపణలు చేసింది.