ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా కొత్త ఏడాదికి విషెష్ చెబుతూ 2021లో తనకు బాగా నచ్చిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. తండ్ర తన కొడుకును తోపుడు బండిపై తీసుకెళ్తుండగా, కొడుకు బండి మీదున్న పాత సూట్‌కేసుపై కూర్చొని క్లాస్ పుస్తకం చదువుకుంటూ బిజీగా ఉన్నాడు. కొడుకు చుదువుకుంటున్న తీరును చూసి ఆ తండ్రి ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నట్టుగా చెమటను తుడుచుకుంటూ కొడుకువైపు చూస్తున్నాడు. ఈ ఫొటోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 2021లో నాకు బాగా నచ్చిన ఫొటో. ఎవరు తీశారో తెలియదు.
Read: అలర్ట్: తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటివిటి రేటు…
ఆశ, కృషి, ఆశావాదానికి ఈ ఫొటో నిలువెత్తు నిదర్శనం.. మనం ఎందుకు జీవిస్తున్నామో ఈ ఒక్క ఫొటో చూస్తే సరిపోతుందని ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. టాలెంట్ ఉన్న ఎందరినో ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. కొడుకు కోసం ఓ తండ్రి పాత కార్ల సామాన్లతో కారును తయారు చేయడం, బైక్ మెకానిక్ పాడిన సాంగ్‌ను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం వంటివి చేశారు. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
And here’s my favourite photo of the year. Apologies, I don’t know who took it so cannot acknowledge the photographer. It showed up in my inbox. Hope, Hard Work, Optimism. The essence of why we live…Once again, have a fulfilling New Year. pic.twitter.com/TwucYZruQA
— anand mahindra (@anandmahindra) December 31, 2021