చాలా కాలంగా పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఈ కుమ్ములాటల కారణంగా అమరీందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. రాజీనామా చేసిన తరువాత ఢిల్లీ వెళ్లివచ్చిన ఆయన కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండటం లేదని చెప్తూనే, వచ్చే ఎన్నికల్లో సిద్ధూని ఒడించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరో 15 రోజుల్లోనే అమరీందర్ సింగ్ కొత్త పార్టీని స్థాపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తనకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ నేతలతో అమరీందర్ సింగ్ చర్చలు జరుపుతున్నారు. కొత్త పార్టీపై మరో రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. అమరీందర్ సింగ్‌తో కలిసి వచ్చేందుకు 12 మంది వరకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. నేతలతో పాటుగా అటు రైతు సంఘాల నేతలతో కూడా అమరీందర్ సింగ్ చర్చలు జరుపుతున్నారు. రైతు సంఘాల నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తారని సమాచారం. రైతులు అమరీందర్ సింగ్‌కు మద్ధతుగా నిలిస్తే కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Read: మైఖేల్ జాక్సన్‌ను తలపిస్తున్న ఇండియన్ స్ట్రీట్ డ్యాన్సర్…