పొట్ట చేత్తో పట్టుకొని ఓ వ్యక్తి తెలియకుండానే బోర్డర్ దాటి వేరే దేశంలోకి అడుగుపెట్టాడు. అలా వచ్చిన వ్యక్తిని బోర్డ్‌లో కాకుండా వేరే నగరంలో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద లభించిన మ్యాపులను బట్టి అతను పక్కదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించి జైలుకు తరలించారు. ఉపాదికోసం వచ్చిన వ్యక్తి అయినప్పటికీ బోర్డర్ దాడటంతో అతనికి 16 ఏళ్ల జైలు శిక్షను విధించారు. జైల్లో శిక్షను అనుభవిస్తూనే, జీవితానికి సరిపడా జీవితసారాన్ని తెలుసుకున్నాడు. ఏనాడు జైల్లో సమయాన్ని వృధా చేయలేదు. జైల్లో పదో తరగతి, ఇంటర్ పూర్తి చేశాడు. ఇందిరాగాంధీ నేషనల్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేశాడు. ఎలక్ట్రీషియన్ కోర్సు నేర్చుకొని జైల్లో ఎక్ట్రికల్ వర్క్స్ చేశాడు. అంతేకాదు, క్రికెట్ పై ఉన్న ఇష్టంతో ఆ ఆటగురించి తెలుసుకున్నాడు. జైళ్ల ఇంటర్ క్రికెట్ పోటీలకు అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 16 ఏళ్ల జైలు జీవితాన్ని ఏ మాత్రం వృధాగా పోనివ్వలేదు. ఆయన పేరు జలాలుద్దీన్. పక్కనే ఉన్న పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి. జైల్లో ఉండగా భగవద్గీత పద్యాలను కంఠత చేశాడు. వాటి అర్ధాన్ని తెలుసుకున్నాడు. కాగా, ఇటీవలే ఆయన్ను వాఘా సరిహద్దులో పాక్ ఆర్మీకి ఆయన్ను అప్పగించారు. అయితే, పాక్ వెళ్తూ జలాలుద్దీన్ తన వెంట ఏమీ కేవలం భగవద్గీతను తప్పించి మరేమీ తీసుకెళ్లలేదు.
Read: నెటిజన్లనే కాదు… బెల్జియం ప్రధానిని ఆకట్టుకున్న ఫొటో…!!