Delhi Assembly special session: ఢిల్లీ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ సమావేశం అయింది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయం నేపథ్యంలో, ఎమ్మెల్యేల కొనుగోలు విమర్శల నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. బుధవారం ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ రూ.800 కోట్లను సిద్ధం చేసిందని
పార్టీ ఫిరాయింపు దారులను బీజేపీ ప్రొత్సాహిస్తుందని అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫార్మ్స్ తన అధ్యయనంలో వెల్లడించింది. 2014 నుంచి 21 మధ్య దేశ వ్యాప్తంగా 173 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వివిధ పార్టీల నుంచి కాషాయ కండువా కప్పుకునట్లు తెలిపింది. అంతేగాక వివిధ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన 253 మంది అభ్యర్ధులు బీజేపీ తీర్థం పుచుకున్నట్లు ఏడీఆర్ నివేదికలో వెల్లడించింది. గత ఏడేళ్లలో పార్టీ ఫిరాయింపులతో అత్యధికంగా బీజేపీ లాభపడగా, ఎక్కువగా నష్టపోయిన పార్టీగా…