భారతీయ మత్స్యకారులకు శ్రీలంక కోర్టు (Sri lanka Court) విముక్తి కల్పించింది. 18 మంది జాలర్లను (18 indian fishermen) న్యాయస్థానం విడిచిపెట్టింది. శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేటాడుతున్నారన్న కారణంతో భారత్ జాలర్లను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 7న జాఫ్నాలోని డెల్ఫ్ట్ ద్వీపం తీరంలో భారతీయ మత్స్యకారులను అరెస్టు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన జాఫ్నాలోని మేజిస్ట్రేట్ 18 మంది మత్స్యకారులను విడిపిస్తూ తీర్పు వెలువరించింది. ఇద్దరు పడవ డ్రైవర్లకు మాత్రం ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
భారతీయ మత్స్యకారులను కోర్టులో హాజరుపరచగా వారంతా నేరాన్ని అంగీకరించారు. దీంతో 18 మంది మత్స్యకారులను విడిచి పెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. శ్రీలంక నావికాదళం మరియు జాఫ్నాలోని భారత డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం సహాయంతో వారిని స్వదేశానికి పంపించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.
శ్రీలంక జలాల్లో భారతీయ మత్స్యకారులు అక్రమ చేపల వేటను ఆపడానికి భారత డిప్యూటీ హైకమిషన్ జోక్యం చేసుకోవాలని శ్రీలంక కోరింది.