నేడు కామారెడ్డి బంద్.. రైతుల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు
కామారెడ్డి రైతుల భూ పోరాటం తెలంగాణ మొత్తాన్ని ఉడికిస్తోంది. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ మంటలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని నిన్ననే నిరసనకు దిగిన రైతులు. ఇవాళ బంద్‌కు కామారెడ్డి పిలుపునివ్వడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. కామారెడ్డి బంద్‌తో మరింత టెన్షన్ పెరిగింది. చేతిలో ఉన్న పంటపొలాలు ఆగమైతే మాస్టర్ ప్లాన్ ద్వారా మా పొలాలు ఎత్తుపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పొలాలు కోల్పోతే మేము ఏం తినాలి? ఎక్కడికి పోవాలని కామారెడ్డి అన్నదాతలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. మీ మాస్టర్ ప్లాన్ మాకొద్దంటూ మా పొలం మాకిచ్చెయ్యండి అంటూ కామారెడ్డి రైతు గోస మిన్నంటుతున్నాయి. నిన్న కలెక్టరేట్ ముట్టడితో ఉద్రికత్త చోటుచేసుకోవడంతో.. పోలీసుల ఎంట్రీ ఇచ్చారు. అయితే కామారెడ్డి రైతుల ఆందోళనకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ మద్దతు పలికారు.
నేడు కామారెడ్డికి బండిసంజయ్.. రైతులకు మద్దతుగా బీజేపీ చీఫ్
నేడు రైతుల ఆందోళనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొనున్నారు. బాధిత రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. ఇక కామారెడ్డి కి కాంగ్రెస్ బృందం బయలు దేరింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు రెండు బృందాలుగా కామారెడ్డికి కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. కిసాన్ కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి ల నేతృత్వంలో ఒక బృందం.. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తోపాటు, సీనియర్ నాయకులు బృందంగా నాయకులు కామారెడ్డి కి వెళ్తున్నారు.
కామారెడ్డి బంద్ కు కాంగ్రెస్ పార్ట్ సంపూర్ణ మద్దతు
కామారెడ్డి బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రకటించారు. కామారెడ్డి రైతు జేఏసీ ఇచ్చిన బంద్ కు కాంగ్రెస్ శ్రేణులు మద్దతు ఇచ్చి అంత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా ను రద్దు చేసి ప్రజ్ క్షేత్రం లో సభలు జరిపి రైతులతో చర్చించాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య జఠిలం అయ్యిందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి కి కాంగ్రెస్ బృందం బయలు దేరింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు రెండు బృందాలుగా కామారెడ్డికి కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. కిసాన్ కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి ల నేతృత్వంలో ఒక బృందం.. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తోపాటు, సీనియర్ నాయకులు బృందంగా నాయకులు కామారెడ్డి కి బయలుదేరారు.
నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన
నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. పటాన్ చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి హరీష్ రావు పర్యటన కొనసాగనుంది. సంగారెడ్డి లో జరిగే జెడ్పి సర్వ సభ్య సమావేశంలో మంత్రి పాల్గొని..కంటి వెలుగు పథకం పై జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు మంత్రి హరీష్ రావు
ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్.. ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్
ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. అక్టోబరులో వన్డే ప్రపంచకప్ జరుగుతుంది. అయితే అంతకంటే ముందే ఆసియా కప్ కూడా జరగనుంది. ఈ టోర్నీని వన్డే ఫార్మాట్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉండగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ మాత్రం వేదికగా విషయాన్ని ప్రస్తావించలేదు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ సందిగ్థత వ్యక్తం చేయడంతో ఆసియా కప్ ఎక్కడ జరుగుతుందో ఇంకా క్లారిటీ రాలేదు.
రిషబ్ చేరిన ఆస్పత్రి ఫొటోను పోస్ట్ చేసిన ఊర్వశి..
ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత ‘ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా.. ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ముంబైకి చెందిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి ఫొటోను షేర్ చేసింది. కారు ప్రమాదంలో మోకాలు, చీలమండలో స్నాయువు గాయాల చికిత్స కోసం డెహ్రూడూన్ నుంచి ముంబైలోని అంధేరీలో గల ఆస్పత్రికి తరలించిన కొద్దసేపటికే ఈ పోస్ట్ చేయడం గమనార్హం. ఊర్వశి తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఏమి రాయనప్పటికీ, ఆ సమయంలో తాను ముంబైలో ఉన్నానని ఆమె చెప్పకనే చెప్పింది. డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి వెళ్తున్న రిషబ్ పంత్ ఎన్‌హెచ్-58 హైవేపై అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోర కారు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రిషబ్ ఒక్కడే కారులో ఉన్నాడు.
ఇంట్లో ఉన్న 7గురిని హత్య చేసి.. ఆపై తానూ కాల్చుకుని..
అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉటా రాష్ట్రంలోని ఎనోచ్ సిటీలో తుపాకీ గాయాలతో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. అందులో 5 పిల్లలు ఉన్నట్లు చెప్పారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. ఓ ఇంట్లో సాధారణ తనిఖీ నిమిత్తం వెళ్లినప్పుడు ఈ మృతదేహాలు తమకు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. బుధవారం ఒకే కుటుంబానికి చెందిన ఇంటిలో ముగ్గురు పెద్దలు, ఐదుగురు పిల్లలను అధికారులు కనుగొన్నారని, అందరూ తుపాకీ గాయాలతో మరణించారని ఒక ప్రతినిధి తెలిపారు. “ఇంట్లో ఉన్న ఏడుగురిని చంపిన తర్వాత అనుమానితుడు తన ప్రాణాలను తీసుకున్నాడని ఆధారాలు సూచిస్తున్నాయి” అని ఓ ప్రకటన పేర్కొంది. అతని పేరు 42 ఏళ్ల మైఖేల్ హైట్ అని తెలిసింది. తన భార్య విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఆ వ్యక్తి కుటుంబంపై కాల్పులకు పాల్పడ్డాడని అధికారులు గురువారం తెలిపారు.
ఉగ్ర నరసింహుడి రూపంలో రానున్న బాలయ్య
జనవరి 12న వీరసింహా రెడ్డి ఆగమనం ఏ రేంజులో ఉండబోతుందో అందరికీ చిన్న సాంపిల్ లా చూపించబోయే ట్రైలర్ బయటకి వచ్చే సమయం ఆసన్నం అయ్యింది. ఈరోజు ఒంగోల్ లో జరగనున్న ప్రీ ఈవెంట్ లో వీర సింహా రెడ్డి ట్రైలర్ ని లాంచ్ చెయ్యనున్నారు. సాయంత్రం 8:17 నిమిషాలకి బాలయ్య ఉగ్రనరసింహుడి రూపంలో యుట్యూబ్ ని షేక్ చెయ్యనున్నాడు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా బాలయ్య బ్లాక్ షర్ట్ వేసి పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య కనిపించలేదు, ఆ స్టైలిష్ ఎట్ మాస్ లుక్ ని బాలయ్యకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా చూసుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈరోజు సాయంత్రం బయటకి రానున్న ట్రైలర్ తో వీర సింహా రెడ్డి ప్రమోషన్స్ తారాస్థాయికి చేరుకోనున్నాయి. ఈ ట్రైలర్ తో బాలయ్య ఈ సంక్రాంతి నాదే అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకూ ఉన్న హైప్ మరింత పెరగాలి అన్నా, జనవరి 12న ఓపెనింగ్స్ అదిరిపోవాలి అన్నా ట్రైలర్ విజిల్స్ వేయించే రేంజులో ఉండాలి. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి, ఒక మూడు డైలాగులు పూనకలు తెచ్చే రేంజులో వినిపిస్తే చాలు వీర సింహా రెడ్డి ట్రైలర్ చేసే సౌండ్ గట్టిగానే వినిపిస్తుంది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?