మందు బాబులకు వినూత్న శిక్ష.. వైజాగ్ బీచ్ మొత్తం క్లీన్..!
విశాఖ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మందు బాబులకు విధించిన శిక్ష ఆస్తికరంగా మారింది.. గత మూడు రోజుల్లో డంకెన్ డ్రైవ్ లో 52 మంది మందుబాబులు విశాఖ పోలీసులకు చిక్కారు. అయితే, అందరినీ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. ఇక్కడే వినూత్నంగా ఆలోచించారు విశాఖ కోర్టు జడ్జి.. మందుబాబులకు జరిమానా మాత్రమే విదిస్తే సరిపోదని భావించిన కోర్టు.. వారిలో పరివర్తన తెచ్చేందుకు పూనుకున్నారు.. అది కూడా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే కోణం చూస్తూ.. అందరిని బీచ్‌లో ఉన్న వ్యర్థాలను ఏరివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇక, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు 52 మంది మందుబాబులను వైజాగ్ బీచ్‌కు తీసుకెళ్లారు పోలీసులు.. బీచ్‌లో పడిఉన్న కవర్లు, బాటిళ్లు.. ఇలా అనేక వ్యర్థాలను చేతిలో పట్టుకుని.. బీచ్‌ను శుభ్రం చేసే పనిలో పడ్డారు మందుబాబులు. బీచ్‌లోకి వెళ్లి వ్యర్థాలను ఎరివేశారు.. ట్రాఫిక్ పోలీసులు వారిని గైడ్ చేశారు. కోర్టు తీర్పుపట్ల బీచ్‌కు వచ్చే పర్యాటకులతో పాటు.. స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇలాగైనా మందు బాబుల్లో మార్పు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.. అయితే, మందు బాబులను పోలీసులు బీచ్‌కు తీసుకురావడం.. బీచ్ మొత్తం క్లీన్ చేయించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కొందరు.. మందు బాబులకు తగిన శిక్ష ఇది అని కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు అసలు లిక్కర్ అమ్మడం కంట్రోల్ చేయాలి కదా? లిక్కర్ అమ్మి వాళ్లను తాగేలా చేసి.. మళ్లీ అరెస్ట్ చేయడం ఏంటి? ఫైన్లు ఏంటి? శిక్షలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
గన్నవరం ఘర్షణ.. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు..
కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే.. టీడీపీ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయుల మధ్య చెలరేగిన వివాదంలో.. టీడీపీ కార్యాలయం ధ్వంసం అయ్యింది.. పలు కార్లను కూడా ధ్వంసం చేశారు.. ఓ కారుకు నిప్పుపెట్టారు.. కార్యాలయంలో ఫర్నీచర్, అద్దాలు పగలగొట్టారు.. ఇక, ఈ దాడికి నిరసనగా టీడీపీ ఆందోళనకు దిగింది.. రోడ్డుపై బైఠాయించారు టీడీపీ నేతలు.. దీంతో మళ్లీ మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది.. టీడీపీ నేత పట్టాభి సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.. మరోవైపు.. గన్నవరం ఘటనలో 6 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు పోలీసులు.. గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదుపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సహా పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.. రెండు కేసుల్లో హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, 143, 147, 149, 307 , 333, 341, 353 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు పెట్టారు. గన్నవరంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు గన్నవరం సీఐ కనకారావు.. ఈ కేసులో ఏ1 గా పట్టాభి, ఏ2గా దొంతి చిన్నాతో పాటు మరో 15 మంది పై కేసులు నమోదు చేశారు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు సీమయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఇక, రమేష్ బాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసులో 143, 147, 149, 353 ఐపీసీ సెక్షన్ ల కింద కేసు పెట్టారు.. ఇక, అరెస్ట్ చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలను గన్నవరం కోర్టులో హాజరుపర్చారు పోలీసులు..
హిజ్రాలకు వైఎస్ షర్మిల బహిరంగ క్షమాపణ చెప్పాలే..
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై హిజ్రాలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమీర్‌పేట మైత్రివనం సిగ్నల్ వద్ద హిజ్రాల ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. అయితే.. వైఎస్ షర్మిల బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ భారీగా హిజ్రాలు నిరసన తెలిపారు. అయితే..ఇటీవల వైఎస్ షర్మిల బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ ప్రస్తావన తెచ్చినందు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా అమీర్‌పేటలో హిజ్రాలు చేసిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. తమకు షర్మిల తక్షణం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకుంటే పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు హిజ్రాలు. అయితే.. ఇటీవల షర్మిల మహూబుబాబాద్ లో మాట్లాడుతూ.. ‘శంకర్ నాయక్ తనను శిఖండి అని కొజ్జా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడిన షర్మిల ఎవడ్రా కొజ్జా.. హామీలు అమలు చేయని నువ్వు కదా కొజ్జా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతు రుణమాఫీ చెయ్యని మిమ్మల్ని కొజ్జాలు కాకుంటే మరేమంటారు అంటూ ప్రశ్నించారు. ఆరు నెలల్లో పోడు పట్టాలు ఇవ్వని మీరు కొజ్జాలు కాకపోతే మరేమవుతారు అంటూ’ అంటూ తీవ్ర స్థాయిల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా హిజ్రాలు ధర్నాకు దిగారు. అమీర్‌పేటలోనే కాకుండా.. వరంగల్‌లోనూ హిజ్రాలు ధర్నాకు దిగారు. షర్మిల ఫ్లెక్సీని చెప్పుతో కొట్టి దగ్దం చేశారు.
అన్నం పెట్టిన చిచ్చు.. రూమ్‌మేట్ నోట్లో మట్టి, రాళ్లు కుక్కి చంపేసిన స్నేహితుడు
ఓ వ్యక్తి తన ఆహారాన్ని రూమ్‌మేట్ నేలపై విసిరికొట్టాడనే కోపంతో అతనిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. స్నేహితుడిని హత్య చేసిన అనంతరం పెరట్లోకి తీసుకెళ్లి సమాధి చేశాడు. ఆ సమాధిని గమనించిన ఓ సాక్షి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 18 అంగుళాల లోతైన రంధ్రంలో దేహం పాక్షికంగా బయటకు కనిపించడంతో వారు కనుగొన్నారు. పోర్ట్‌పియర్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు 22 ఏళ్ల బ్రయాన్ మార్క్వెజ్ తన రూమ్‌మేట్ తన ఆహారాన్ని నేలపై విసిరికొట్టి అగౌరవపరిచినట్లు చెప్పాడు. ఈ అవమానానికి తాను వెంటనే స్పందించలేదని.. ఆ రాత్రి తాగి తన రూమ్‌మేట్‌ను ఎదుర్కోవాలనుకున్నాడు. రాత్రి తాగిన అనంతరం రూమ్‌మేట్ హిస్మానిక్ పక్కటెముకలు, ముఖం కొట్టినట్లు చెప్పాడు. అతడిని నేల మీద పడేశాడు. అతను లేవకుండా పడిపోవడంతో మట్టి, కంకర రాళ్లను బాధితుడి నోట్లో పోశాడు. అనంతరం లేవమని బెదిరించాడు. చాలా సార్లు అరిచినా లేవకపోవడంతో చనిపోయాడని గుర్తించాడు. అప్పుడు మార్క్వెజ్ మృతదేహాన్ని పెరట్లోకి లాగి పాతిపెట్టడానికి లోతు తక్కువగా ఉన్న సమాధిని తవ్వాలని ఎంచుకున్నట్లు చెప్పాడు.
వారి వల్లే యుద్ధం.. మేం చర్చలకి సిద్ధం.. పుతిన్ షాకింగ్ స్టేట్‌మెంట్
ఉక్రెయిన్‌తో తాము కొనసాగిస్తున్న యుద్ధానికి పాశ్చాత దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు తాము సిద్ధంగానే ఉన్నప్పటికీ.. ఆ దేశాలే చర్చలకు సిద్ధంగా లేవని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో.. జాతిని ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు. స్థానిక ఘర్షణను అంతర్జాతీయ ఘర్షణగా మార్చేందుకు పాశ్చాత్త దేశాలు పూనుకున్నాయని.. ఉక్రెయిన్‌కు కూడా ఇరాక్, యుగోస్లావియా గతి పటిస్తారని కుండబద్దలు కొట్టారు. పుతిన్ మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు పాశ్చాత్య దేశాలదే బాధ్యత. సమస్యను పరిష్కరించేందుకు మేము సాధ్యమైనన్నీ చర్యలు తీసుకుంటున్నాం. దేశం ఎదుర్కొంటోన్న సవాళ్లను దశలవారీగా క్రమపద్ధతిలో పరిష్కరిస్తాం. కానీ.. మా వెనక అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. నాటో.. రష్యా సరిహద్దు వద్దకు విస్తరించాలని భావించింది. మేము ఇఖ్కడ మా దేశ ఉనికి గురించే మాట్లాడుతున్నాం. మేము సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు సిద్ధంగానే ఉన్నా.. ఆ దేశాలే సిద్ధంగా లేవు. వారి వైఖరితో సమస్య మరింత జఠిలమవుతోంది. ఆ దేశాల యుద్ధం కోసం 150 బిలియన్ల డాలర్లు ఇచ్చాయి. ఉక్రెయిన్‌కు ఇరాక్, యుగోస్లావియా గతి పట్టిస్తారు. కానీ.. మేం ప్రపంచ భద్రత కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు.
రూపాయి ఇవ్వని కండక్టర్.. కోర్టుకెక్కిన ప్రయాణికుడు.. చివరికి ఏమైందంటే?
తమ వద్ద చిల్లర ఉన్నప్పటికీ.. కొందరు బస్ కండక్టర్లు చిల్లర లేదని చెప్తుంటారు. మరికొందరైతే.. బస్సు దిగేటప్పుడు చిల్లర తీసుకోవాలని చెప్పి, టికెట్ వెనకాల రాసిస్తారు. అయితే.. ఒకట్రెండు రూపాయలే కదా అని, చాలామంది కండక్టర్ వద్ద నుంచి చిల్లర తీసుకోకుండా వెళ్లిపోతారు. ఇంకొందరైతే.. బస్సు దిగే తొందరలో చిల్లర తీసుకోవడం మర్చిపోతారు. కానీ.. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా చేయలేదు. తనకు కండక్టర్ ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదని, ఏకంగా కోర్టుకెక్కాడు. చివరికి విజయం సాధించి.. అందరికీ ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రయాణికుడి హక్కు గురించి అవగాహన కల్పించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. 2019లో రమేశ్ నాయక్ అనే వ్యక్తి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్(బీఎంటీసీ) బస్సు ఎక్కాడు. శాంతి నగర్ నుంచి మజెస్టిక్ బస్ డిపో వరకు టికెట్ తీసుకున్నాడు. టికెట్ ధర రూ. 29 కావడంతో.. అతడు కండక్టర్‌కు రూ.30 ఇచ్చాడు. అయితే.. కండక్టర్ అతనికి ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదు. చిల్లర ఇవ్వకుండానే వెళ్తుండటంతో.. తన రూపాయి తిరిగి ఇవ్వాలని అడిగాడు. ఇందుకు ఆ కండక్టర్ ‘నా వద్ద చిల్లర లేదు’ అంటూ గట్టిగా అరిచాడు. కండక్టర్ తీరు చూసి ఖంగుతిన్న రమేశ్.. అతనిపై బీఎంటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. వాళ్లు ఈ ఫిర్యాదుని సీరియస్‌గా తీసుకోలేదు. తాను ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో.. రమేశ్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. తన రూపాయి తిరిగి ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టారని, ఇందుకు రూ.15వేలు పరిహారంగా ఇప్పించాలని కోరాడు.
అయ్యగారు.. లవ్ మిషన్ మొదలుపెట్టారు.. ఇక అరుపులే
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరువాత అఖిల్ అక్కినేని వెండితెరపై కనిపించిందే లేదు. ఇక ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అఖిల్ అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక రిలీజ్ డేట్ ప్రకటించడంతో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగానే మిషన్ మ్యూజిక్ ను మొదలుపెట్టారు. ఈ సినిమాలోని మొదటి సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. మళ్లీ మళ్లీ నువ్వే ఎదురొస్తే అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 7.03 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాకు తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ్ సంగీతం అందిస్తున్నాడు. సాంగ్ చాలా కొత్తగా అనిపిస్తోంది. ముఖ్యంగా అఖిల్ లుక్ అయితే అదిరిపోయింది. హీరోయిన్ సాక్షి వైద్య, అఖిల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో అయ్యగారు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
వెంకీమామ ఫేవరేట్ హీరో.. ఆయన కోసం నిర్మాతగా కూడా మారాడని తెలుసా..?
విక్టరీ వెంకటేష్ కు ఫ్యాన్స్ వార్ ఉండవు.. ఆయన అంటే అందరికి అభిమానమే.. టాలీవుడ్ మొత్తానికి ఆయనే వెంకీ మామ. ప్రస్తుతం వెంకీ తన అన్న కొడుకు రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక సినిమాలు విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో వివాదాలు లేని హీరో వెంకీ. అయితే షూటింగ్.. లేకపోతే కుటుంబం.. ప్రైవేట్ పార్టీలో కన్పించడం కూడా చాలా తక్కువ. సోషల్ మీడియాలో కూడా చాలా కామ్. యాక్టివ్ గా ఉంటాడు కానీ, ఏది పడితే అది పోస్ట్ చేసి అభిమానులను విసిగించడు. ఇక వెంకీ ఇష్టాయిష్టాలు కూడా చాలా తక్కువమందికి తెలుసు. అయితే తాజాగా వెంకీ ఫేవరేట్ హీరో ఎవరో తెలిసింది. సాధారణంగా ఎంత పెద్ద స్టార్ కి అయినా ఇతర హీరోలు ఖచ్చితంగా ఫేవరేట్ ఉంటారు. ఇక వెంకీకి.. సోగ్గాడు శోభన్ బాబు అంటే చాలా అభిమానం అంట. ఆయనతో కలిసి నటించాలని చాలా ప్రయత్నించారట. కానీ అది కుదరలేదు. శోభన్ బాబుకు వెంకీ పెద్ద ఫ్యాన్.. ఆయన కోసం ఏకంగా వెంకీ మామ నిర్మాతగా కూడా మారారట. అంతేకాదండీ.. శోభన్ బాబు సినిమాలు నిర్మించడానికి వెంకటేష్ కొత్త ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్థాపించాడట.. దానిపేరే వెంకటేష్ ఎంటర్ ప్రైజెస్. ఈ బ్యానర్ లో శోభన్ బాబు నటించిన చిత్రం ‘ఎంకి నాయుడు బావ’. ఈ చిత్రంలో శోభన్ బాబు సరసన వాణిశ్రీ నటించింది. ఈ చిత్రం పూజా కార్యక్రమంలో శోభన్ బాబును వెంకటేష్ కలిశాడు. అప్పటి అరుదైన చిత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా తరువాత వెంకీ.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోయాడట. ఆ తరువాత కలియుగ పాండవులు సినిమాతో ఆయన తెరంగేట్రం అవ్వడం జరిగింది. ఇక సినిమాల్లోకి వచ్చాకా.. శోభన్ బాబుతో కలిసి సినిమా చేసేందుకు ప్రయత్నించాడు కానీ కుదరలేదని టాక్.. అయితే వెంకీ నటించినత్రిమూర్తులు సినిమాలో శోభన్ బాబు ఒక సాంగ్ లో కనిపిస్తారు. నిజం చెప్పాలంటే.. తెలుగు హీరోలందరూ ఒక సాంగ్ లో కనిపించిన ఏకైక సాంగ్ అది. ఏది ఏమైనా తన ఫేవరేట్ హీరో కోసం 18 ఏళ్లకే వెంకీ నిర్మాతగా మారడం మాత్రం నిజంగా గర్వించదగ్గ విషయమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.