బంగాళాఖాతంలో అల్పపీడనం..! 4 రోజులు ఏపీలో భారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లా ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర సహా.. దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఈ సమయంలో ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్లు వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.. ఇక, అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో.. దాని ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో.. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, పల్నాడు, కృష్ణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు.. మరోవైపు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.. అయితే, రేపు అనగా గురువారం రోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ కాగా.. అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పల్నాడు, గుంటూరు, కృష్ణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.. ఇక, సముద్రం అలజడిగా మారడంతో ఈ సమయంలో మత్స్యకారుల చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు..
నేను రౌడీనే.. జేసీ సంచలన వ్యాఖ్యలు..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపర్తి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది మాట్లాడినా సంచలనంగా మారుతుంది.. ఏది ఉన్నా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడి ఎప్పుడూ వార్తల్లో ఉంటారు జేసీ.. అది సొంత పార్టీ నేతలైనా.. లేదా ఇతర పార్టీలకు చెందినవారైనా ఆయన తీరు అలాగు ఉంటుంది.. అయితే, జేసీ రౌడీలా ప్రవర్తిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఆరోపణల వచ్చిన నేపథ్యంలో.. అవును.. నేను రౌడీనే.. అందుకే నా ఊరు బాగుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అందరూ మున్సిపల్ ఎన్నికలలో ఓడిపోతే.. నన్ను ఒక్కడినే గెలిపించారని గుర్తుచేశారు జేసీ.. ఇక, తాడిపత్రి ప్రజలు నాకు దేవుళ్లు.. వాళ్ల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్నారు.. అనంతపురం జిల్లా డీపీవో అనేక అక్రమాలకు పాల్పడ్డాడు.. ఆయన అక్రమాలకు పాల్పడలేదని ఆయననే చెప్పమనండి అంటూ సవాల్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. నేను తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి కారణం అప్పుడు ఉండే నాయకుల్లో నాకు కనిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.. ఎందుకంటే ఆయన విజన్ ఉన్న వ్యక్తి అంటూ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.. నాకు న్యాయం చేస్తానంటే నేను ఎవరి దగ్గరికి అయిన ఆధారాలు తీసుకొని వస్తాను అన్నారు.. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు నాలా బతకలేదన్న జేసీ.. మా చంద్రబాబు నాయుడుకి విధేయుడిని… ఆయన కూర్చోమంటే కూర్చుంటా.. లేయమంటే లేస్తాను అన్నారు.. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతా.. గత ఐదు సంవత్సరాలు నేనే కష్టపడ్డాను అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు టీడీపీ సీనియర్ నేత, తాడిపర్తి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి..
చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు.. తండ్రీకొడుకుల కిడ్నాప్, హత్య
పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది.. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు అయినా తండ్రీకొడుకులను దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా సంతమగులూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం చాలా ఏళ్లుగా బెంగుళూరులో స్థిరపడ్డారు.. అయితే, కొడుకు ప్రశాంత్ రెడ్డికి, తండ్రి వీరస్వామి రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములతో వివాదాలు వచ్చాయి.. ఇరువురికి చెందిన చెక్‌బుక్ తోసుకొని ప్రత్యర్థి భాగస్వాములు గడ్డం అనీల్ కుమార్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని ఒంగోలు, అద్దంకి, నరసరావుపేట.. ఇలా పలు ప్రాంతాలలో చెక్‌బౌన్స్ కేసులు వేశాడట.. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజు నరసరావుపేటలో కోర్టులో వాయిదాల నిమిత్తం బెంగుళూరు నుండి వచ్చారు ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి.. నరసరావుపేట కోర్టు సమీపంలో ఉన్న హోటల్ కి వెళ్లి టిఫిన్ తిని బయటికి వస్తున్న ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి పై గడ్డం అనీల్ రెడ్డి మరియు కొందరు వ్యక్తులు విరుచుకుపడ్డారు.. వారిని కిడ్నాప్ చేశారు.. ఇద్దరిని బాపట్ల జిల్లా సంతమగులూరు గ్రామ పరిధిలోని ఓ ప్రైవేట్ వెంచర్లో దారుణంగా హత్య చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు గడ్డం అనీల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.. ప్రధాన అనుమనితుడుగా ఉన్న బాదం మాధవ రెడ్డి.. 2014 నుంచి 2017 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి ఇంఛార్జ్‌గా పనిచేశారు.. అయితే, తండ్రీకొడుకుల హత్యకు వ్యాపార లావాదేవీలే ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.. హత్యకు పాల్పడిన వారు, హత్య చేసిన వారు సంతమగులూరు మండలానికి చెందిన చిన్న ముఠా సభ్యులుగా సమాచారం..
దళిత యువకుడిపై దాడి ఘటనపై స్పందించిన మంత్రి సుభాష్..
మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు మంత్రి సుభాష్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మొన్న అమలాపురం ఘటనలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది డబ్బులు తీసుకున్నారు.. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు దాడి చేశారని తెలిపారు.. అయితే, దాడి చేసినవారు. నా అనుచరులు అని వైసీపీ బ్యాచ్.. నా పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. అవసరం లేని విషయాలు ట్రోల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. గత ప్రభుత్వంలో దాచుకున్న జగన్ మద్యం తాగి మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, నా అనుచరులు దాడి చేశారు అంటున్నారు.. అనుచరులు అంటే నా తో తిరిగారా..? నా కారు ఎప్పుడైనా ఎక్కారా..? అని ప్రశ్నించారు మంత్రి వాసంశెట్టి సుభాష్..
“ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ..” సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి మలుపు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్ కు ప్రీ ఫైనల్స్ లాంటివని.. ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమైన కావాలంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమని స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దన్నారు. పోటీచేసే అభ్యర్థులపై స్థానిక బీఆర్ఎస్ నేతలు ఏకాభిప్రాయానికి రావాలన్నారు.. పార్టీ పరంగా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా కొట్లాడుతాం.. అభ్యర్థులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్ హామీలు, మోసాలు చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టకుంటే భవిష్యత్తులో మళ్ళీ నష్టపోతామన్నారు. బాల్కొండలో పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ దారుణమని.. రేషన్ కార్డులు ఇవ్వటం గొప్ప పని కాదు.. అది ప్రభుత్వం బాధ్యత అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు.
అల్ ఖైదా ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్..
గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఓ పెద్ద ఉగ్రవాద కుట్రను బహిర్గతం చేసింది. భారత ఉపఖండంలోని అల్ ఖైదా (AQIS)తో సంబంధం ఉన్న మాడ్యూల్‌ను ఛేదించింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ అధికారుల ప్రకారం.. పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులలో ఇద్దరు గుజరాత్, ఒకరు ఢిల్లీ, మరొకరు నోయిడా (ఉత్తరప్రదేశ్)కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఉగ్రవాదులందరూ అల్ ఖైదాకి చెందిన Al-Qaeda in the Indian Subcontinent తో సంబంధం కలిగి ఉన్నారని చెబుతున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను సైఫుల్లా ఖురేషి , మొహమ్మద్ ఫర్దీన్, మొహమ్మద్ ఫైక్, జీషన్ అలీగా గుర్తించారు.
వరసగా మూడో ఏడాది టాప్-10 బెస్ట్ ఎయిర్‌పోర్టుల్లో ముంబై..
ప్రపంచంలో బెస్ట్ టాప్ -10 ఎయిర్‌పోర్టుల్లో ముంబై విమానాశ్రయం చోటు దక్కించుకుంది. వరసగా మూడో ఏడాది కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) ట్రావెల్ + లీజర్ వరల్డ్స్ బెస్ట్ అవార్డ్స్ 2025లో ప్రపంచంలోని టాప్ 10 అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటిగా ఎంపికైంది. 84.23 రీడర్ స్కోర్‌తో, ఏడాది జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది కూడా ర్యాంకింగ్స్ లో ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాల విమానాశ్రయాలు సత్తా చాటాయి. టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టు 98.57 రీడర్ స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో సింగపూర్ చాంగీ ఎయిర్ పోర్టు 2వ స్థానంలో, ఖతార్ దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు 3వ స్థానంలో, అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం 4వ స్థానంలో, దుబాయ్ ఎయిర్ పోర్టు 5వ స్థానంలో ఉన్నాయి.
అమెజాన్ కొత్త గేమ్ ప్లాన్.. Alexaలో Bee AI టెక్నాలజీ
సాంకేతిక రంగంలో అగ్రగామి అమెజాన్ మరోసారి పెద్ద సంచలనం సృష్టించింది. రోజంతా వినిపించే మాటలను నోట్లుగా మార్చే ప్రత్యేక వెయిరబుల్ పరికరాన్ని తయారు చేసిన Bee AI స్టార్టప్‌ను అమెజాన్ కొనుగోలు చేసింది. సాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ రూపొందించిన Bee Pioneer అనే గ్యాడ్జెట్ ఇప్పటికే వినియోగదారుల్లో మంచి హడావుడి సృష్టించింది. $49.99 (సుమారు రూ. 4,000) ధరలో లభ్యమయ్యే ఈ పరికరం రోజువారీ సంభాషణలను రికార్డ్ చేసి, సారాంశాలు తయారు చేస్తుంది. ఈ విధంగా యూజర్లకు టు-డూ లిస్ట్‌లు, ముఖ్య సూచనలు ఆటోమేటిక్‌గా అందిస్తుంది.
ఫ్యాన్స్ కి షాక్.. థియేటర్ ముందు బ్యానర్ చించేసిన కార్యకర్తలు !
హరిహర వీరమల్లు సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు మేనియా కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అన్న మంగళగిరిలో మీడియాతో ముచ్చటించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు మరోసారి విశాఖపట్నంలో ఒక ఈవెంట్లో హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తితో పాటు అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
పవన్ ఎన్నడూ చేయని యాక్షన్ సీన్లు.. వీరమల్లులో అవే హైలెట్..
పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి అనేక విషయాలు లీక్ అవుతున్నాయి. పవన్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ నుంచి మొదటిసారి వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఇది. అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో యాక్షన్ సీన్లే హైలెట్ కాబోతున్నాయంట. ట్రైలర్ లో మనకు పవన్ యాక్షన్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయని హింట్ ఇచ్చేశారు. ప్రమోషన్లలో కూడా యాక్షన్ సీన్ల గురించే ఎక్కువగా టాపిక్ వచ్చింది. పవన్ కూడా తాను ఓ యాక్షన్ సీన్ ను కొరియోగ్రఫీ చేశానని ఓపెన్ అయ్యాడు.