చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి.. ప్రజల ప్రాణాలు తీస్తోంది..!
టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న మరో కార్యక్రమంలోనూ ప్రాణ నష్టం జరిగింది.. గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం వైఎస్ జగన్.. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.. మరోవైపు.. గుంటూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు హోంమంత్రి తానేటి వనిత.. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోం మినిస్టర్.. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రఘాడ సానుభూతిని తెలిపారు.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.. ఇక, తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు అయితే, చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల సమయంలో 30 మందిని పోట్టనపెట్టుకున్నారు అని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సంక్రాంతి కానుకను జగన్ ప్రభుత్వం తొలగించిందని చెప్పడానికే చంద్రబాబు ఇప్పుడు సంక్రాంతి కానుకల కార్యక్రమం నిర్వహించారు.. ప్రజలను చంపి చంద్రబాబు సాధించేది ఎమిటి? అని నిలదారు. వారి కుటుంబాలకు డబ్బులు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబులో మార్పు రావాలని ఆ దేవుడిని ప్రార్థించినట్టు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వ్యాఖ్యానించారు వెల్లంపల్లి శ్రీనివాస్. మరోవైపు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో సభలలో ప్రజలను బలికోనడం బాధాకరం అన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్.. వైఎస్ జగన్ సుధీర్ఘ పాదయాత్ర చేసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదన్న ఆమె.. నిన్నటి ఘటనలో భాధితులుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.. ఇక, చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా అరిష్టమేనని మండిపడ్డారు మంత్రి గుమ్మనూరు జయరాం.. గతంలో పుష్కరాలు.. ఇప్పుడు సభలు అప్పుడు ప్రజలు చనిపోతున్నారు.. అందుకే చంద్రబాబుని ప్రజలు ఆదరించడం లేదన్నారు మంత్రి జయరాం..
నిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ వైద్యుల భర్తీ నోటిఫికేషన్
సీనియర్ రెసిడెంట్ వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు నిమ్స్ అధికారులు విడుదల చేశారు. ఈనెల 7 లోపు అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని నిమ్స్ అధికారులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ELCU పైలెట్ ప్రాజెక్టు కింద ఈ నియామక ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని నిమ్స్ అధికారులు తెలిపారు. అనస్థీషియా, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్ లో ఎండి చేసిన అభ్యర్థులుకు సీనియర్ పోస్టులకు అర్హులవుతారని నిమ్స్ అధికారులు పేర్కొన్నారు.
స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించిన హరీష్‌రావు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనంతో భక్తులను స్వామి వారి అనుగ్రహిస్తున్నారు. అయితే.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంత్రి హరీశ్ రావు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆలయాల్లన్నీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటికిటలాడుతున్నాయి. అయితే.. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆలయాలు భక్తులు వేకువజామునుంచే పోటెత్తారు. దీంతో హరి నామస్మరణతో ఆలయాల్లో మారుమ్రోగుతున్నాయి.
అమెరికాలో అయితే చంద్రబాబుకి 15 ఏళ్ల శిక్ష పడేది..
గుంటూరులో తొక్కిసలాటపై టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. చంద్రబాబు మాకు ఇదేమీ ఖర్మ..? అని ప్రశ్నించిన ఆయన.. కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడే చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చా.. అయినా ఒక్క శాతం కూడా మారలేదు అని మండిపడ్డారు. అసలు డీజీపీకి బుద్ది ఉండొద్దా…? అనుమతులు ఎలా ఇస్తారు..? అని నిలదీశారు.. పది వేల మందికి అనుమతి తీసుకుని నలభై యాభై వేల మందిని తరలించారని ఆరోపించారు.. అసలు, చట్ట విరుద్దమైన సభలకు ఎలా అనుమతి ఇస్తారు అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో అయితే చంద్రబాబుకి 15 ఏళ్ల శిక్ష పడేదన్నారు. ప్రజలకు ఇప్పటికైనా బుద్ది రావాలని పేర్కొన్నారు కేఏ పాల్. చంద్రబాబు ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆరోపిస్తున్నారు.. మరి ఈ విషయం సీఎం జగన్ కూడా ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించు కేఏ పాల్.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకి కూడ అప్పులు ఇప్పిచ్చాననని చెప్పుకొచ్చారు.. అసలు గుంటూరులో తొక్కిసలాట జరిగితే.. తమ్ముడు పవన్ కల్యాణ్ ఏమయ్యాడు? అని ప్రశ్నించారు పాల్.. ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నా స్పందించడా..? అని నిలదీశారు.. సినిమాలేవో చేసుకోవాలి.. పవన్‌కు రాజకీయాలు ఎందుకు అనే తరహా వ్యాఖ్యలు చేశారు.. అయితే, నేను తప్ప ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరని తెలిపారు కేఏ పాల్.
కొత్త ఏడాది.. సరికొత్త రూల్స్..
ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక ఇప్పుడో లెక్క.. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కొన్ని విభాగాలకే పరిమితమైన ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్.. అక్రమంగా అన్ని విభాగాలకు, అన్ని కార్యాలయాలకు విస్తరిస్తూ వస్తోంది ప్రభుత్వం.. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి రాష్ట్ర సచివాలయం, జిల్లా కేంద్ర కార్యాలయాలు, హెచ్‌వోడీ ఆఫీసుల్లోనూ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.. అయితే, వీకెండ్ సెలవులతో ఇంకా యాప్ డౌన్ లోడ్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో.. కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పడంలేదట.. దీనిపై జనరల్ జీవోనే విడుదల అయ్యాయి.. కానీ, విభాగాల వారీగా అంతర్గత ఆదేశాలు జారీ కాలేదని చెబుతున్నారు సెక్రటేరియట్ ఉద్యోగులు.. స్మార్ట్ ఫోన్లు లేనివాళ్ల హాజరు పరిస్థితి ఏంటి? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు.. యాప్ డౌన్ లోడ్, తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తుండగా ఇకపై అన్ని ప్రభుత్వ శాఖల్లోను అమలు చేయనున్నారు. మరోవైపు అటెండెన్స్‌పై ప్రభుత్వ నిబంధనలపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయినా.. ఇవాళ్టి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ తప్పనిసరి చేశారు. ఉద్యోగులు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని అటెండెన్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులతో పాటు డీడీవోలకు యాప్ వినియోగంపై మార్గదర్శాలు ఇప్పటికే జారీ అయ్యాయి.. మరోవైపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల వివరాలు, బాధ్యతలు, తీసుకునే జీతం వంటి సమాచారాన్ని బోర్డుల రూపంలో ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.. మొత్తంగా కొత్త ఏడాదిలో సరికొత్త కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం..
కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరో వివాదం నెలకొంది.. కృష్ణానదిలో ప్రయాణికులను సంగమేశ్వరానికి తరలించే విషయంలో రెండు రాష్ట్రాలకు చెందిన బోటు నిర్వాహకుల మధ్య ఈ తాజా వివాదం చోటు చేసుకుంది.. నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.. కృష్ణానది మధ్యలోనే పడవలపై కొట్టుకోవాడానికే సిద్ధమయ్యారు ఇరు రాష్ట్రాల బోటు నిర్వాహకులు.. తెలంగాణ బోట్లను సోమశిల నుంచి సిద్ధేశ్వరం వరకే నడపాలన్నారు ఏపీ బోటు నిర్వాహకులు.. సంగమేశ్వరం గుడికి రావొద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఇరు రాష్ట్రాలకు చెందిన బోట్ల యజమానులు గొడవకు దిగారు. ఇప్పటికే ఈ విషయంపై ఆత్మకూరు తహసీల్దార్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు.. ఈ వివాదం సద్దుమనిగే వరకు ఇరు రాష్ట్రాలవారు ఎవరూ పడవల తిప్పకూడదని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.. దీంతో, సంగమేశ్వరం ట్రిపిక్‌కు బ్రేక్‌లు పడినట్టు అయ్యింది..
చంద్రబాబును అరెస్టు చేస్తాం..!
చంద్రబాబు అధికార దాహం, ప్రచార పిచ్చి వల్లే అమాయక ప్రజల మరణాలు సంభవిస్తున్నాయని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్.. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీలో 40 మందిని పొట్టన పెట్టుకున్నాడని మండిపడ్డారు.. ఇంత మంది మరణాలకు కారణం అయిన చంద్రబాబుపై అసలు ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని నిలదీశారు.. గుంటూరులో తొక్కిసలాట ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి జోగి రమేష్.. చంద్రబాబును అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఇక, చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు.. ఉయ్యూరు ఫౌండేషన్ లాంటి చంద్రబాబు మసాలా ఫౌండేషన్ లపై విచారణ చేస్తామని వెల్లడించారు. మరోవైపు.. చంద్రబాబును డీజీపీ కట్టడి చేయాల్సిందే నని సూచించారు మంత్రి జోగి రమేష్.
పెద్ద నోట్ల రద్దు సరైనదే.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు..
పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదే అని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది ఎన్డీయే ప్రభుత్వం. కేంద్ర నిర్ణయాన్ని తప్పు పడతూ మొత్తం 58 పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటన్నింటిని సోమవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. నోట్ల రద్దులో ఎలాంటి లోటుపాట్లు జరగలేదని చెప్పింది.
హిందువుల ఇళ్లలోకి చొరబడి కాల్పులు.. ఆధార్ కార్డ్‌తో గుర్తించి టెర్రరిస్టుల ఘాతుకం
జమ్మూ కాశ్మీర్ లో రాజౌరీ ఉగ్రవాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హిందువులే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం నలుగురు వ్యక్తులు మరణించారు. మరోవైపు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతాబలగాలు భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆదివారం సాయంత్రం 7 గంటలకు రాజౌరీలోని హిందువుల ఇళ్లకు చొరబడి కాల్పులు ప్రారంభించారు ముష్కరులు. ముందుగా వారి ఐడెంటిటీని గుర్తించేందుకు వారి ఆధార్ కార్డును ఉపయోగించారని భద్రతా వర్గాలు తెలుపుతున్నాయి.