ముస్లింలు శరద్ పవార్, ఠాక్రే, షిండేలా ఉండలేరా..?

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్ర థానే జిల్లాలోని ముంబ్రా సబర్బన్ ప్రాంతంలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్దవ్ ఠాక్రే పార్టీ, పార్టీ గుర్తను కోల్పోవడంపై తనకు సానుభూతి లేదని ఆయన అన్నారు. ముంబ్రా ఎందుకు ఉనికిలోకి వచ్చింది.. ముంబై నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చే బలవంతం చేసింది ఎవరు..? టాడా కింద ప్రజలను జైళ్లలోకి నెట్టిన రోజులను తాను మరిచిపోలేదని అసద్ అన్నారు. ఎన్సీపికి చెందిన అజిత్ పవార్, సుప్రియా సూలే నాయకులు కాగలిగితే, ఉద్ధవ్ ఠాక్రే తండ్రి పుణ్యమా అని నాయకుడిగా మారగలిగితే, ఏక్ నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్ లు నాయకులు కాగలిగితే, మహారాష్ట్ర ముస్లింలు ఎందుకు వారిలా ఉండలేరని ప్రశ్నించారు.ముస్లిం ఐక్యత కోసం అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. నినానాదాలు చేయడం ద్వారా మనం ఒక్కటి కాలేదమని, ఐక్యంగా ఓట్లు వేసి నాయకులుగా మారిండి అని అన్నారు.
గచ్చిబౌలీ స్టేడియంలో అలరించిన ఇళయరాజా లైవ్ కన్సర్ట్

హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా లైవ్ కన్సర్ట్ ను నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెడ్ కార్పేట్ ఈవెంట్ కార్యక్రమం కొనసాగింది. ఇళయరాజ దర్శకత్వం వహించిన సినిమాలలోని అలనాటి మధురమైన పాటలను ఆయన ముందే గాయనీ గాయకులు వీనులవిందుగా ఆలపించారు. ఇళయరాజా పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. సినీరంగ ప్రముఖులు రాజా సర్ కి అభినందన పేరుతో సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆశీర్వచనాలతో సత్కరించారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీగాయకులు ఇళయరాజాను శాలువాతో సన్మానించారు. దర్శకుడు కోదండరామిరెడ్డి, నిర్మాత అశ్వినిదత్, సంగీత దర్శకులు మణిశర్మ, ఆర్.పీ.పట్నాయక్, పాటల రచయిత హరిరామజోగయ్య శాస్త్రి, నిర్మాత సీ.కళ్యాణ్, నడుడు మురళీమోహన్, ప్రముఖనటి మృణాల్ ఠాకూర్, గాయని సునీత, నటుడు రఘుబాబులు ఇళయరాజాను సన్మానించారు. ఇళయరాజ 80ఏళ్లలోకి అడుగుపెడుతున్న సందర్బంగా 80 ఏళ్ల లోగోను ప్రముఖ రచయితా విజయేంద్రప్రసాద్ రిమోట్ తో ఆవిష్కరించారు. కమ్మని సంగీతం..ఎంత విన్నా…వినాలనిపించే సాహిత్యం ఇళయరాజా పాటల్లో ఉంటుందని అని సినీ ప్రమఖులు ఇళయరాజాని కొనియాడారు.
తిరుచానూరులో ఉద్రిక్తత.. వైసీపీ వర్సెస్ టీడీపీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుచానూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నారా లోకేష్ బస చేస్తున్న టెంట్‌లో సైట్ వద్ద నోటికి తెల్ల రిబ్లన్ కట్టుకుని కొందరు తిరుపతి వైసిపి కార్పొరేటర్లు సహా కేడర్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాతో రండి చేసిన అభివృద్ధి చూపిస్తామంటూ ఫ్ల కార్డులు చేత పట్టి నిరసనకు దిగారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై నిన్న తీవ్రమైన స్ధాయిలో విమర్శలు చేశారు నారా లోకేష్. దీంతో వైసీపీ నేతలు ఈ విధంగా నిరసనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు అలిపిరి పోలీసు స్టేషను కు వైసీపీ నేతలను తరలించారు. చంద్రబాబునాయుడు, లోకేష్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. లోకేష్ నాయుడు గారు అవినీతిని నిరూపించండి లేదా క్షమాపణలు చెప్పండి అంటూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. వారిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు.
జీ20 సమావేశాలను అస్థిర పరిచేందుకు ఆ దేశాల ప్రయత్నాలు

భారత్ లో జరుగుతున్న జీ20 సమావేశాలను అస్థిర పరిచేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ రష్యా మండిపడింది. రష్యాకు వ్యతిరేకంగా ఈ వేదికను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాయని శనివారం ఆరోపించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జీ7 దేశాలు రష్యా వ్యతిరేక మార్గంలో సమావేశాలను వాడుకుంటున్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బెంగళూర్ లో జరిగిన జీ20 ఆర్థిక మంత్రుల సమావేశంలో సమిష్టి నిర్ణయాలకు అంతరాయం కలిగించాలని ప్రయత్నించిందని రష్యా ఆరోపించాయి. పాశ్యాత్య దేశాలు సాధ్యమైనంత వరకు తన విధ్వంస విధానాన్ని విడిచిపెట్టాలని, బహుళ ధ్రువ ప్రపంచం యొక్క వాస్తవ లక్ష్యాలను గుర్తించాలని రష్యా పిలుపునిచ్చింది. శనివారం జరిగిన జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండిస్తూ సంయుక్త తీర్మానం చేయాలని కొన్ని దేశాలు భావించాయి. అయితే దీన్ని చైనా, రష్యాలు తప్పుపట్టాయి. దీంతో సంయుక్త ప్రకటన సాధ్యం కాలేదు. ఈ ఏడాది జీ20 అధ్యక్ష పదవిని భారత్ తీసుకుంది. దీంతో ఈ ఏడాది జీ20 సదస్సులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరగనున్నాయి
జూబ్లిహిల్స్ టీటీడీ ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

జూబ్లిహిల్స్ టీటీడీ ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి దేవేరులు సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం దగ్గర సందడి నెలకొంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జూబ్లిహిల్స్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉదయం భక్తులకు అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం అందిస్తున్నారు.
భారత్‌పై విషాన్ని చిమ్మిన అమృత్‌పాల్ సింగ్
ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని సవాల్ చేస్తూ హెచ్చరించారు. ఇటీవల అజ్నాలా పోలీస్ స్టేషన్ పై సాయుధులుగా వచ్చి దాడి చేశారు అమృత్ పాల్ సింగ్ మద్దతుదారులు. అతని అనుచరుడిని అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ఖలిస్తానీ మద్దతుదారులు వచ్చి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ ఘటన మరోసారి పంజాబ్ లో ఖలిస్తానీ వేర్పాటువాదం బలపడుతోందని చెబుతోంది. ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ తనను తాను బ్రిందన్ వాలా 2.0గా భావించుకుంటున్నారు.‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ గా ఉన్న అమృత్ పాల్ తాజాగా భారత్ పై విషాన్ని చిమ్మాడు. ప్రభుత్వాన్నే సవాల్ చేస్తూ హెచ్చరించాడు. అజ్నాలా దాడి హింసాత్మకం కాదని.. అసలు హింస ఇంకా చూడలేదని వార్నింగ్ ఇచ్చారు. మీరు నినాదాలు చేయడాన్ని, జెండాలను ప్రదర్శిండాన్ని హింసగా పరిగణిస్తున్నారని.. ఇది నిజమైన హింస కాదని ఆయన అన్నారు.
కుప్పంలో ఘోర రోడ్డుప్రమాదం… ముగ్గురు వైద్యవిద్యార్ధులు మృతి

చిత్తూరు జిల్లా కుప్పం(Kuppam) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిపల్లి మండలం సెట్టిపల్లి పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది కారు. ముగ్గురు వైద్య విద్యార్థులు (Medical Students) మృతిచెందారు. మృతులు PES మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. PES ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మృతులు వికాస్,కళ్యాణ్, ప్రవీణ్ గా గుర్తించారు. గడిపల్లి మండలం సెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. వీరిలో ఇద్దరు కడప (Kadapa) జిల్లాకు, ఒకరు నెల్లూరు (Nellore) జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు వైద్యవిద్యార్ధుల మృతిలో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన తీరు హృదయవిదారకంగా వుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత దీప్తి శర్మకు కొత్త బాధ్యత

సెమీ ఫైనల్లో గెలిచి ఫైనల్ కు చేరి ప్రపంచకప్ చేజిక్కించుకోవాలన్న టీం ఇండియా ఆశలకు ఆస్ట్రేలియా జట్టు గండికొట్టింది. సెమీఫైనల్‌లో ఓటమి తర్వాత భారత మహిళా క్రీడాకారిణి దీప్తి శర్మకు భారీ బాధ్యత మీద పడింది. యూపీ వారియర్స్ జట్టు నాయకత్వాన్ని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అలిస్సా హీలీకి అప్పగించింది. దీప్తి శర్మకు ఆ జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. యూపీ వారియర్స్ యాజమాన్యం దీప్తి శర్మ కోసం 2.6 కోట్లు ఖర్చు చేశారు. దీంతో జట్టు కెప్టెన్సీ దీప్తికి దక్కుతుందని అందరూ భావించారు కానీ టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం ఎలిసా హిల్లీకి అప్పగించింది.భారత్ సెమీ ఫైనల్ చేరే వరకు దీప్తి మంచి ప్రదర్శన చేసింది. ఐదు మ్యాచ్‌ల్లో మొత్తం ఆరు వికెట్లు తీసింది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒక వికెట్ తీసింది. అదే సమయంలో, ఆమె వెస్టిండీస్‌పై మూడు విజయాలు సాధించింది. ఇంగ్లండ్‌పై ఆమె ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగింది. ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ కోసం ఎదురు చూస్తున్నట్లు అలిస్సా హీలీ ప్రకటించింది. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినందుకు గర్వంగా ఉందని తెలిపింది. ఈ టోర్నీని గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని అలిస్సా హీలీ చెప్పింది.
నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్.. గెలుపెవరిదో?

ప్రపంచకప్ ట్రోఫీ కోసం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టు. సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. అందువల్ల, రెండు జట్లు ప్రపంచ కప్ ట్రోఫీ కోసం ఢీకొంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ గొప్ప మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. మ్యాచ్ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టు. అయితే సౌతాఫ్రికా స్వదేశంలో ఆడుతోంది. దక్షిణాఫ్రికా అభిమానులు తమ జట్టు ఫైనల్‌కు చేరుకున్నందుకు ఆనందంగా వారు ర్యాలీ నిర్వహించారు.