యాదాద్రి నారసింహుడి సేవలో గవర్నర్ తమిళిసై

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు నాలుగో రోజు ఉదయం వత్రశాయి అలంకరణ సేవ అత్యంత వైభవంగా కొనసాగుతుంది. పశ్చిమ రాజగోపురం గుండా సేవను తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం వేంచేపు మండపం పై ఆస్థానం చేసి, వేదమంత్రాలు, దివ్యప్రబంధ పశురాలను పఠించారు. సాయంత్రం హంస వాహన అలంకరణ సేవ నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. ఈనేపథ్యంలో.. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు గవర్నర్ తమిళసై చేరుకున్నారు. గవర్నర్ ను గార్డ్ ఆఫ్ హానర్ తో జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. నాలుగో రోజు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం జరిగే హోమం, వటపత్ర శాయి అలంకార సేవలో గవర్నర్ తమిళసై పాల్గొన్నారు.
గన్నవరం పాక్ లో ఉందా? ఏమిటీ అరాచకం?

ధ్వంసమైన గన్నవరం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పార్టీ ఆఫీసుని వైసీపీ కార్యకర్తలు, గూండాలు ధ్వంసం చేసిన తీరును చంద్రబాబుకు వివరించారు పార్టీ నేతలు. మొన్న నేను గన్నవరం వద్దామనుకుంటే.. రానివ్వరా..?గన్నవరం ఏమైనా పాకిస్తానులో ఉందా..? అని చంద్రబాబు మండిపడ్డారు. సీఐ క్రిస్టియన్ అని ఎఫ్ఐఆర్లో పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారు..?అధికారంలోకి రాగానే తప్పు చేసిన అధికారులు, పోలీసుల మక్కెలిరగ్గొడతాం.పోలీసులు చేసిన సిగ్గుమాలిన పనిని నేను వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా హర్షించరు.టీడీపీ లేకుంటే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణేదీ..?కృష్ణా జిల్లాలోనే ఈ విధంగా ఉంటే.. పులివెందుల్లో ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి..?వంశీ పశువుల డాక్టర్.తనను గెలిపించిన వాళ్లనే కొట్టించాడు.గన్నవరంలో భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. ప్రజల్లో భయాన్ని సృష్టించారు.కార్లు, స్కూటర్లు డామేజ్ చేశారు.పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు.పక్కనే ఎయిర్ పోర్టు ఉంది.. హై సెక్యూర్టీ జోన్ లో ఉంది.ఇలాంటి హై సెక్యూర్టీ జోన్ లో విధ్వంసం సృష్టించారు.ఎందరో మహానుభావులు చరిత్ర సృష్టించిన ప్రాంతం గన్నవరం అన్నారు. అలాంటి గన్నవరంలో రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏయూ వీసీ తీరుపై విచారణ జరపాలి

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏయూ పరువు పూర్తిగా దిగజారిపోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఏయూ ను వైసీపీ కార్యాలయం గా మార్చేశారు…వీసి ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. ఈనెల 12 వ తేదీన ఏయూ లో గంజాయి పేకెట్లు దొరికాయి.ఏయూ జరుగుతున్న కార్యక్రమాలు పై నేను మాట్లాడితే నాకు ఫోన్లు చేసి బెదిరించారు.విసి ప్రసాద్ రెడ్డి ఫోన్లు చేసి బెదిరించడానికి ఒక బ్యాచ్ ని తయారుచేశారు.ఏయూ ప్రతిష్ట ను దిగజార్చుతుంటే విశ్వవిద్యాలయం లో చదువుకున్న మేధావులు స్పందించాలి. జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ రాజకీయాలను ఏయూ నుంచి నడిపారు.విసి ప్రసాద్ రెడ్డి ఉత్తరాంద్ర లో ఉన్న ప్రేవేటు విద్య సంస్థల యజమాన్యాలలతో సమావేశం పెట్టి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధికి ఓటు వేయాలని పెట్టి బెదిరించారు.దీనిపై విసి ప్రసాద్ రెడ్డి పై జిల్లా కలెక్టర్, కేంద్ర,రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాను. నాకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రిప్లై వచ్చింది..రాష్ట్ర ఎన్నికల కమిషన్ , జిల్లా కలెక్టర్ నుంచి రిప్లై రాలేదు. ఏయూ విసి ప్రసాద్ రెడ్డి పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏయూ విసి ప్రసాద్ రెడ్డి ఉండటానికి వీలు లేదు…వెంటనే రీకాల్ చేయాలి. ఏయూ విసి ప్రసాద్ రెడ్డి ప్రవర్తన పై ప్రతిపక్ష పార్టీలు ,ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ స్పందించాలన్నారు అయ్యన్నపాత్రుడు.
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇంట విషాదం

భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభాతాయ్ పాటిల్ భర్త దేవిసింగ్ షెకావత్ ఈరోజు (ఫిబ్రవరి 24, 2023) కన్నుమూశారు. 89 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో దేవి సింగ్ షెకావత్ పుణెలోని కేఈఎం ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 9.30 గంటలకు మృతి చెందాడు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు పూణెలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తవ్వకాల్లో బయటపడిన పురాతనమయిన టాయిలెట్

ప్రపంచంలోనే అత్యంత పురాతమైన ఫ్లషింగ్ టాయిలెట్ బయటపడింది. చైనా పురాతన శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో 2400 ఏళ్ల నాటి టాయిటెల్ వెలుగులోకి వచ్చింది. చైనాలోని జియాన్ నగరంలో ఓ పురావస్తు ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో టాయిలెట్ బాక్స్, పైపును పరిశోధకులు కనుక్కున్నారు. ఈ టాయిలెట్ యుయాంగ్ లోని ఒక ప్యాలెస్ శిథిలాల్లో కనుగొనబడింది. ఇది వారింగ్ స్టేట్స్ కాలం(424 BC), క్విన్ రాజవంశం (221 BC – 206 BC) నాటిదని పరిశోధకులు భావిస్తున్నారు. పురాతన శాస్త్రవేత్తలు దీన్ని ‘‘లగ్జరీ టాయిలెట్’’గా పిలుస్తున్నారు. బాత్రూమ్ ప్యాలెస్ లోపల ఉందని, దీనిని బయట ఉన్న ఒక గొయ్యితో పైపు ద్వారా కలుపుతోందని పరిశోధకలు వెల్లడించారు. తవ్వకాలు జరిపిన టీంలో భాగమైన చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ పరిశోధకుడు లియు రుయ్ మాట్లాడుతూ.. చైనాలో ఇప్పటి వరకు కనుగొనబడిన మొట్టమొదటి ఏకైక ఫ్లష్ టాయిలెట్ ఇదే అని వెల్లడించారు. ఇలాంటిది కనుగొనడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. దీనిని వారింగ్ స్టేట్స్ కాలంలో, హాన్ రాజవంశం సమయంలో ఉన్నత స్థాయి అధికారులు వాడేవారని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాయిలెట్ ను క్విన్ జియాగోంగ్ లేదా అతని తండ్రి క్విన్ జియాన్ గాంగ్ ఉపయోగించారని అంచనా వేస్తున్నారు.
మిస్ట్ కాల్ తో బాలిక హత్యకేసు చేధించిన పోలీసులు

ఢిల్లీలో ఇటీవల 11 ఏళ్ల బాలిక ఆచూకీ కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత హత్యకు గురై శవంగా దొరికింది. అయితే ఈ కేసును ఓ మిస్డ్ కాల్ ఆధారంగా పోలీసులు ఛేదించారు. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో బాలిక కనిపించకుండా పోయిన రోజున ఆమె తల్లికి తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఉదయం 11.50 గంటలకు ఆమె తల్లికి మిస్డ్ కాల్ వచ్చింది, ఆమె తిరిగి కాల్ చేసినప్పుడు, నంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ తరువాత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 12 రోజుల తర్వాత హత్యకు సంబంధించి రోహిత్ అలియాస్ వినోద్ అనే 21 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 9న ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తన కూతురు స్కూల్ బస్సులో వెళ్లిందని బాధితురాలి తల్లి తెలిపింది. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో తమ కుమార్తె కిడ్నాప్‌కు గురైందని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరి 10న కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
ఇండియన్ కరెన్సీ ఎందుకు పడిపోతోందంటే..

అమెరికా డాలర్‌తో పోల్చితే మన రూపాయి మారకం విలువ రోజు రోజుకీ పడిపోతోంది. ప్రస్తుతం 83 రూపాయల దిశగా పయనిస్తోంది. ఆ స్టేజ్ కూడా దాటిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ కరెన్సీ ఇంతలా బక్క చిక్కటానికి చాలా కారణాలున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను మరింత పెంచనుందనే భయం.. దేశీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం.. క్రూడాయిల్ రేట్లు పెరగటం.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు భారీగా వృద్ధి చెందటం.. దీనికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. 2023వ సంవత్సరంలో రూపాయి మారకం విలువ 82 రూపాయల 75 పైసలతో ప్రారంభమైంది. జనవరి 20వ తేదీ నాటికి బాగానే బలపడింది. 80 రూపాయల 98 పైసలకి కోలుకుంది. 2022 నవంబర్ తర్వాత ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి. అయితే.. ఆ లాభాలన్నీ ఆవిరి కావటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రూపాయి మారకం విలువ గతేడాది అక్టోబర్‌లో ఒకసారి 83కు పతనమైంది. రానున్న నెల రోజుల్లో 82 నుంచి 83 రూపాయల 50 పైసల వరకు విలువ కోల్పోయే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరించారు.
నేనేనా రైట్స్ స్వంతం చేసుకున్న ఎస్.పి. సినిమాస్

యూనిక్ కంటెంట్ ప్రాజెక్ట్‌లు ప్రామెసింగ్ బ్రాండ్ నుంచి వస్తున్నపుడు ప్రేక్షకులు, ట్రేడ్ సర్కిల్స్ లో ఆసక్తి నెలకొంటుంది. ఎస్పీ సినిమాస్ తమిళ చిత్రసీమలో ప్రసిద్ధ నిర్మాణ, పంపిణీ సంస్థలలో ఒకటిగా పేరు పొందింది. ప్రామెసింగ్ ప్రాజెక్ట్‌లను అందిస్తున్న ఎస్పీ సినిమాస్ తెలుగు పరిశ్రమలోకి తొలి అడుగు వేస్తోంది. రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో, ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో, ఆపిల్ ట్రీ స్టూడియోస్ రాజ్ శేఖర్ వర్మ నిర్మించిన ‘నేనే నా’ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ అండ్ నాన్-థియేట్రికల్ రైట్స్ ని ఎస్పీ సినిమాస్ దక్కించుకుంది. రాజ్ శేఖర్ ఇంతకుముందు సూపర్‌హిట్ చిత్రం ‘జాంబీ రెడ్డి’ని నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందే చిత్రాలను అందించడంలో ఎస్పీ సినిమాస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలని ప్రమోట్ చేయడం, మార్కెట్ చేయడానికి సరైన వ్యూహాలను ప్లాన్ చేయడం, భారీ స్క్రీన్స్ అందించడంలో ఎస్పీ సినిమాస్ కి ప్రత్యేక విధానం ఉంది. ఎస్పీ సినిమాస్ గోల్డెన్ టచ్ ‘నేనే నా’కి విశేషమైన రీచ్‌ను అందిస్తుందని ఆపిల్ ట్రీ స్టూడియోస్ భావిస్తోంది.
మూతపడనున్న ముంబై బీసీసీఐ ఆఫీస్

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్, మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. అంతకు ముందే బీసీసీఐ ముంబై కార్యాలయం మూతపడనుంది. ప్రస్తుతం ముంబైలోని వాంఖడే స్టేడియం పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో బీసీసీఐ కార్యాలయం ఉంది. 2006 నుండి, BCCI ఈ కేంద్రం నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇప్పుడు బీసీసీఐ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల నుంచి అందరూ ఈ ఆఫీసును ఖాళీ చేయాల్సి వస్తోంది. అలా చేయమని బీసీసీఐని ఎవరూ ఒత్తిడి చేయలేదు. కార్యాలయం మూసివేసిన తర్వాత బీసీసీఐ పనితీరు ఎలా ఉంటుందనేది ప్రశ్న. అందుకు బీసీసీఐ కూడా తగిన ఏర్పాట్లు చేసింది. బిసిసిఐ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నందుకు కారణం ఉంది.. ప్రస్తుతం ఉంటున్న కార్యాలయం పాతది.. దాని వెనుక కారణం మేకోవర్. బీసీసీఐ తన ప్రధాన కార్యాలయాన్ని ముంబైలో నిర్మించబోతోంది. బీసీసీఐ భవన రూపకల్పన, నిర్మాణంలో మార్పులు చేయనున్నారు. కొత్త కార్యాలయంలో సమావేశ మందిరం, సమావేశ మందిరం ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచకప్‌తోపాటు ఇతర ట్రోఫీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.