బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు లేడు..సొంత రాష్ట్రానికి అధ్యక్షుడెవరు?
కేసీఆర్ ఏపీ వారిని పిలిపించుకొని జాయిన్ చేసుకున్నారు అట.. వంద ఎలుకలు తిన్న పిల్లి లెక్క నంగనాచి లెక్క మాట్లాడారు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అయితే.. తాజాగా ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌కు జాతీయ అధ్యక్షుడు లేడు.. సొంత రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించ లేదని ఆయన అన్నారు. వచ్చిన వాళ్లకు సిగ్గు ఉండాలి.. గత ఎన్నికల ముందు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాడు… ఆంధ్ర వాళ్ళను తిట్టాడు.. ఆంధ్ర బిర్యాని పెండ బిర్యాని అంటివి కదా ఆంధ్ర బిర్యానీ నీ, ఉలవ చారు ను తీసుకుపోయి తినిపియండి కేసీఆర్‌కు అంటూ ఆయన విమర్శించారు. 24 గంటల కరెంట్ ఎక్కడైనా ఇస్తున్నవా అని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచినవు.. డిస్కంలో నష్టాల్లో ఉన్నాయన్నారు. నీటిని వాడుకునే తెలివి నీకు ఎక్కడ ఉందని, తెలంగాణ ప్రాజెక్ట్ ల ను ఏమి చేశావని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వ్యవసాయ బోర్లు ఎందుకు పెరిగాయన్న బండి సంజయ్.. పాఠశాల విద్యలో తెలంగాణ చివరి గ్రేడ్ ఉందన్నారు.
ఢిల్లీ తరహాలో మరో ఘటన.. స్టూడెంట్లపైకి దూసుకొచ్చిన కారు
రెండ్రోజుల కిందట ఢిల్లీ శివారులోని కాంజావాల్ ప్రాంతంలో ఓ యువతిని కారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం ఎంతటి సంచలనమైందో తెలిసిందే. ఈ అమానవీయ ఘటన మరవకముందే.. అలాంటిదే మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ నోయిడాలో అతివేగంగా వచ్చిన ఓ కారు ముగ్గురు విద్యార్థినులపైకి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ముగ్గురు విద్యార్థినులు గ్రేటర్ నోయిడాలోని కైలాష్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. కాగా, బాధితుల్లో స్వీటీ కుమారి అనే విద్యార్థినికి తల, కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వీరంతా బీటెక్ చదువుతున్నారు. ప్రస్తుతం స్వీటీ కోమాలోకి వెళ్లిపోయిందని ఆమె సోదరుడు సంతోష్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పటి వరకు ఆమె చికిత్సకు రూ.లక్ష ఖర్చు అయ్యిందని.. ఆమె కోలుకోవాలంటే మరో రూ.పది లక్షలు అవసరమని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు దాతలు చేయూత అందించాల్సిందిగా అభ్యర్థించారు. ‘నా పేరు సంతోష్ కుమార్. నా సోదరి స్వీటీ కుమారి కోసం నేను ఫండ్స్ రైజ్ చేస్తున్నాను. తను గ్రేటర్ నోయిడాలోని జీఎన్‌ఐఓటీ కాలేజీలో బీటెక్ చదువుతోంది. యాక్సిడెంట్ తో కోమాలోకి వెళ్లిపోయింది.
ముందస్తు ఎన్నికలొస్తే ….ఏడాది ముందే వైసీపీ ఇంటికి..!!
Anam Ram Narayana Reddy
ఏపీలో జగన్ ప్రభుత్వంపై నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ఏడాది ముందే వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చి నాలుగేళ్లు పూర్తికావొస్తోందని, ఇప్పటికీ సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం సాంకేతిక కారణాలా లేదా బిల్లుల చెల్లింపు జాప్యమా అనేది తెలియడంలేదన్నారు. కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడంలేదో అర్థంకావడం లేదని ఆనం వ్యాఖ్యానించారు. సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అధికారులను అడిగితే త్వరలో పూర్తిచేస్తామంటున్నారని, కానీ అవి పూర్తయ్యేలోపు తమ పదవీకాలం పూర్తవుతుందని ఆనం రాంనారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. కార్యాలయాలు లేకపోతే సచివాలయ సిబ్బంది ఎక్కడ కూర్చుని పనిచేయాలని ప్రశ్నించారు. మరోవైపు ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆరోపించారు. అయితే ఇటీవల తరచూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ఆనంపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది.
ఎమ్మెల్యే కేతిరెడ్డికి పంచ్ డైలాగ్ వేసిన బాలుడు
మ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిత్యం జనంలో వుంటారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు, పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయో లేదో ఆయనే స్వయంగా పరిశీలిస్తూ ఉంటారు. అయితే ఆయనకే మైండ్ బ్లాక్ చేశాడో అబ్బాయి. తన ఆకస్మిక పర్యటనలో భాగంగా కేతిరెడ్డికి వింత అనుభవం ఎదురైంది. లావుగా వున్న ఒక అబ్బాయిని పలకరించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. గుడ్ మార్నింగ్ ధర్మవరంలో పర్యటించారు కేతిరెడ్డి. ఆయన ఒక అబ్బాయిని పిలిచి ఎందుకు లావు అవుతున్నావు. గేమ్స్ ఆడవచ్చు కదా అని అడిగారు ఎమ్మెల్యే. దీనికి బాలుడిచ్చిన సమాధానంతో షాకయ్యారు ఎమ్మెల్యే. అమ్మ ఫోన్ ఇవ్వడం లేదని జవాబిచ్చాడు. ఏంటి నేనంటున్నది గేమ్స్ ఫోన్ లో ఆడమని కాదు.. గ్రౌండ్ లో ఆడు అన్నారు. ఆడుతున్నా.. కబడ్డీ అన్నాడు. కబడ్డీ కాదు కాస్త ఒళ్ళు తగ్గించే గేమ్స్ ఆడమన్నారు. బాలుడి సమాధానానికి అక్కడున్నవారు అవాక్కయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. గేమ్స్ ఆడడం అంటే ఈతరం పిల్లలకు స్మార్ట్ ఫోన్ లో అన్నట్టుగా తయారైందంటున్నారు. సరైన వ్యాయామం లేకపోవడంతో పిల్లల్లో స్థూలకాయం పెరిగిపోతోంది.
ముగిసిన గోదావరి యాజమాన్య బోర్డు సమావేశం
గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ మాట్లాడుతూ.. మొడికుంట వాగు, గూడెం ఎత్తిపోతల డీపీఆర్ ల పై చర్చించామని వెల్లడించారు. ఏపీ కొన్ని సాధారణ అభ్యంతరాలు లేవనెత్తిందన్నారు. నీటి లభ్యత ఉందని కేంద్ర జలసంఘం డైరెక్టర్ వివరణ ఇచ్చారన్నారు. త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నామన్నారు. పోలవరం అంశాన్ని ప్రస్తావించామని, పీపీఏలో చర్చించాలని సూచించారన్నారు. గోదావరిలో మిగుల జలాల లభ్యత కోసం అధ్యయనం అంశాన్ని సీడబ్ల్యూసీకి నివేదించాలని నిర్ణయంచారన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ తీర్పుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయించామని, పూర్తి స్థాయిలో కసరత్తు చేసి వారం రోజుల్లో పిటిషన్ వేస్తామన్నారు. అనంతరం తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ.. పెద్దవాగు ప్రాజెక్టును త్వరగా ఆధునీకరించాలని కోరామని తెలిపారు. మొదటి ప్రాధాన్యంలో ఐదు అంతర్ రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందన్నారు. ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గోదావరిలో ఎంత నీరు ఉంది, ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఉందో తేల్చాలని అడిగామన్నారు.
అలాంటి జీవోలతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరు
ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ప్రజాస్వామ్యంలో సభలు నిర్వహించుకోవడం మన హక్కు. ప్రభుత్వాలకు పాలించే హక్కు ఎలా ఉంటుందో ప్రతిపక్షాలకు వాయిస్ వినిపించుకునే హక్కు ఉంటుంది. ప్రభుత్వం సెక్యురిటీ కల్పించాలి కాని ఒంటెత్తు పోకడలకు పోకూడదు. జీవో జారీ చేయడమంటే ప్రభుత్వం చేతకాని తనమే. సమావేశానికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులదే అన్నారు. ఎక్కడో రెండు చోట్ల ఘటనలు జరిగాయని మన హక్కులను కాలరాయాలని చూడడం సిగ్గుచేటు అని విమర్శించారు గిడుగు రుద్రరాజు. బీజేపీ, వైసీపీ దొందూ దొందే అన్నారు. అధికారంలో ఉంటే ఒక ఆలోచనలు అధికారంలో లేనప్పుడు మరో ఆలోచనలా..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేయలేదా? ప్రజాస్వామ్యం లో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరు. ఇలాంటి జీవోలను కాంగ్రెస్ పక్షాన ఖండిస్తున్నాం. ప్రజలు చాలా పెద్ద ప్రభుత్వాలను చూశారు.. ఇలానే వ్యవహరిస్తే ప్రజలు తిరగబడడం ఖాయం అని హెచ్చరించారు. జగన్ అధికారంలోకి వచ్చాక సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఎనిమిదిన్నరేళ్లుగా చంద్రబాబు, జగన్ ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకొని మోసం చేస్తూనే ఉన్నారు.
ఎమ్మెల్యే ఆనంకి షాకిచ్చిన హైకమాండ్.. నేదురుమల్లికి వెంకటగిరి పగ్గాలు
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ అధిష్టానం షాకిచ్చింది. ఆయనను పార్టీ బాధ్యతలనుంచి తప్పించింది. వెంకటగిరి ఇన్ ఛార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియామకం చేయబోతోంది.. ఆనంపై అధిష్టానం వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళో, రేపో వైసీపీ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేయనుంది. బాలాయపల్లి మండల కేంద్రంలో… వైఎస్సార్ పింఛను కానుకను ప్రారంభించిన ఎం.ఎల్.ఏ. ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. సచివాలయం, వాలంటీర్లకు సచివాలయ భవనాలు లేవు. వాళ్ళు ఎక్కడ కూర్చొని పనిచేయలో తెలియడంలేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన విమర్శలు అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. అద్దె భవనాల్లో, పాడుబడ్డ స్కూళ్ల లోనో. అంగన్వాడీల్లోనో కార్యాలయాలు పెట్టుకుంటున్నారు. నిధులు మంజూరు చేసినా మండలంలో భవనాలు పూర్తి కావడం లేదు. సచివాలయ ఉద్యోగులు ఏమి పనిచేయడం లేదంటే, ఇక్కడ కూర్చోవడానికి స్థలం లేదంటున్నారు.వర్షం పడితే బిల్డింగులు కురుస్తున్నాయి,కంప్యూటర్లు..ఫైళ్లు తడిచిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి.భవనాలు ఉంటేనే సచివాలయ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించగలగుతారు. మౌలిక వసతులు లేనిదే ఏ ప్రభుత్వ అధికారి పనిచేయలేరు. సచివాలయ ఉద్యోగులు ఉన్నత చదువులు చదివి దిక్కులేక రావడం లేదు.
అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు
ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతుండటంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండియాలోనూ ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2022 ఏడాదిని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఘనంగా ముగించింది. డిసెంబర్ నెలలో మొత్తంగా 25 వేలకు పైగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడుపోయాయి. దీంతో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‍లో ఓలా 30 శాతం వాటాను దక్కించుకుంది. ఒకే నెలలో 25వేల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడవడం ఇదే తొలిసారి. తమ కంపెనీ సేల్స్ పెరగడంపై ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం నడుస్తోందని భవీశ్ అగర్వాల్ అన్నారు. 2023లో ఈ వాహనాల అమ్మకాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో వృద్ధి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి మూడు స్కూటర్లు భారత మార్కెట్‍లో అందుబాటులో ఉన్నాయి.