Ntv top-headlines-at-9AM
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు…. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకెండ్ లాంగ్వేజ్,, 6న ఇంగ్లిష్, 8న గణితం, 10న సైన్స్ (భౌతికశాస్త్రం, జీవశాస్త్రం), 11న సోషల్, 11న ఓరియంటల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు 12న ఓరియంటల్. 13న పేపర్-2. ఆ తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కానీ సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 5.50 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు ఇచ్చే మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నపత్రం (బిట్ పేపర్) చివరి 15 నిమిషాల్లో ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా జనరల్ సైన్స్ పరీక్షకు సంబంధించిన రెండు ప్రశ్నాపత్రాలను ఒకే సమయంలో కాకుండా నిర్ణీత సమయంలో విద్యార్థులకు వేర్వేరుగా ఇవ్వాలని పేర్కొంది. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు ఆరు పేపర్లు మాత్రమే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
హెల్ప్ చేస్తాడని స్టేషన్ కెళ్తే.. రూంకి రమ్మన్న ఇన్ స్పెక్టర్
ప్రజలకు రక్షకులుగా ఉండాల్సిన పోలీసులే భక్షకులుగా మారిపోతున్నారు. పోలీస్ స్టేషన్ కెళ్తే న్యాయం దొరుకుతుంది అనుకుంటే.. అక్కడి అధికారి మహిళ పట్ల ప్రవర్తించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తాను ఇబ్బందుల్లో ఉండడంతో ఎంతో నమ్మకంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళకు ఇన్ స్పెక్టర్ హోటల్ రూమ్ కీ ఇచ్చాడు. 15 లక్షలకు పైగా మోసం చేశారంటూ బాధిత మహిళ గత నెలలో కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్‌లోని ఇన్‌స్పెక్టర్‌ను ఆశ్రయించింది. సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదును నమోదు చేసి ఫిర్యాదుదారుడి మొబైల్ నంబర్ కూడా తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అతనికి మెసేజ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆమెకు ఏం చేయాలో తోచలేదు. అతని మెసేజ్‌లకు ఆమె స్పందించలేదు. ఇటీవల, ఈ ఇన్‌స్పెక్టర్ మహిళకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరాడు. మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, ఇన్‌స్పెక్టర్ హోటల్ గది తాళంతో పాటు డ్రై ఫ్రూట్స్ బాక్స్‌ను ఆమెకు ఇచ్చాడు.
ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి హాట్ కామెంట్స్
నిత్యం ఏదో ఒక అంశంపై వార్తల్లో నిలిచే వ్యక్తి మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తమ ప్రాంతానికి వచ్చే వలస పక్షులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ పైనా తాను జస్ట్ కేవలం ప్రజల వైపు చుస్తే చాలు అడ్డుకున్నారు.. అదే తాను సైగ చేస్తే సినిమా వేరేలా ఉండేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. వలస పక్షుల్లారా కబడ్ధార్ ఎవ్వరైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతే నాలుక కోసేస్తానంటూ శంకర్ నాయక్ అన్నారు.వలస పక్షుల్లారా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. శంకర్ నాయక్ ను తిడితే మిమ్ములను తిట్టినట్లు కాదా అని ప్రజలు భావించారు. నేను జస్ట్ ప్రజల వైపైనా చూసిన ఆ చూపుతోటే ఇంత కదిలిక వచ్చిందని.. ఇంకా సైగ చేస్తే సినిమా ఎట్లా ఉండే దో గుర్తు పెట్టుకోవాలని శంకర్ నాయక్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది.
ఇవాళ టీడీపీ ప్రాంతీయ సమావేశం
అమరావతిలో ఇవాళ ఇవాళ టీడీపీ ప్రాంతీయ సమావేశం జరగనుంది. సమావేశంలో పాల్గొననున్నారు ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పరిధిలోని 5 పార్లమెంట్ స్థానాల నేతలు, శ్రేణులు, క్లస్టర్ ఇన్ఛార్జిలు. హాజరు కానున్న విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానాల పరిధిలోని శ్రేణులు.ఎన్నికల సన్నద్ధత పై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు.35 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఐదేసి పార్లమెంట్ స్థానాలు ఒక జోన్ గా, రాష్ట్రాన్ని మొత్తం 5 జోన్లుగా విభజించుకుని పోల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి కీలక సమావేశం.ఈ సమావేశానికి ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జ్ లు, పరిశీలకులు, పాలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జిలు హాజరుకానున్నారు. ఓటర్ వెరిఫికేషన్, కుటుంబ సాధికార సారధి పక్రియపై శ్రేణులకు శిక్షణ ఇవ్వనున్నారు. జోనల్, పార్లమెంట్ల వారీగా చంద్రబాబు అధ్యక్షతన సమీక్షలు నిర్వహిస్తారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ విజయంపై కూడా చర్చించనున్నారు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరనున్నారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఈ కామర్స్ సంస్థలను బాధ్యులుగా చేసే దిశగా కేంద్రం అడుగులు
వికేత్రల మోసాలకు కూడా ఈ-కామర్స్ సంస్థలను బాధ్యులుగా చేసే విధంగా నిబంధనలకు కఠినతరం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. వాటిలో జవాబుదారీతనాన్ని మరింతగా పెంచేలా రూల్స్ ను రూపొందించడంపై వినియోగదారుల వ్వవహారాల శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి, మధ్యవర్తిత్వ సంస్థలుగా అవి పోషిస్తున్న పాత్ర గురించి తెలియజేయాలంటూ కొన్ని ప్రశ్నలను ఈ-కామర్స్ కంపెనీలకు కేంద్ర ఎలాక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పంపించింది. వాటికి సమాధానాలు వచ్చిన తర్వాత మార్గదర్శకాల రూపకల్పన ప్రారంభమవుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది.అమెజాన్, ప్లిప్ కార్ట్ లాంటి ఈ-కామర్స ప్లాట్ ఫామ్ లు సాధారణంగా విక్రేతల, కొనుగోలుదారులను అనుసంధానించే మధ్యవర్తిత్వ సంస్థలుగా వ్యవహిరిస్తున్నాయి. వీటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 79 ప్రకారం నిర్ఠిష్ట బాధ్యతల నుంచి కొన్ని మినహాయింపులు ఉంటున్నాయి. అయితే, ప్రతిపాదిత మార్పుల ప్రకారం దాన్ని మార్చి, మధ్యవర్తిత్వ సంస్థలుగా వాటికి మరింత జవాబుదారీతనాన్ని పెంచేలా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఉస్మానియా యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు నిరుద్యోగ మార్చ్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు దీంతో అక్కడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది నిర్యుద్యోగ మార్చ్‌కు జేఏసీ పిలుపు మేరకు భారీగా విద్యార్థులు చేరుకున్నారు. మరో పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా జేఏసీ నాయకులను అదుపులో తీసుకున్నారు. దీంతో నేడు, రేపు క్యాంపస్ లో హై అలెర్ట్ ప్రకటించింది. TSPSC పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేడు, రేపు ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకు విద్యార్థులు ప్లాన్ చేశారు. దీక్షకి యూనివర్సిటీ అధికారులు పర్మిషన్ లేదన్నా.. ఒక వేళ దీక్ష చేస్తే ఓయూ పోలీసులు కేసులు పెడతామన్నా అవన్నీ పెడచెవిన పెట్టిన విద్యార్థి సంఘాలు దీక్ష చేసి తీరుతామని ఇవాళ దీక్షకు దిగాయి. ఈనేపథ్యంలో.. క్యాంపస్ లోకి ప్రతిపక్ష నాయకులు వస్తే అడ్డుకుంటామన్న అధికార పార్టీ విద్యార్థి సంఘం ప్రకటించింది. ప్రతిపక్ష నాయకుల రాకను విప్లవ వామపక్ష విద్యార్థి సంఘాలు స్వాగతిస్తున్నామన్నారు. TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని విద్యార్థుల డిమాండ్ చేస్తున్నారు. జ్యూడిషియల్ విచారణకి విద్యార్థులు పట్టుపడుతున్నారు. ఈనేపథ్యంలో.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రంగంలోకి దిగిన ఓయూ పోలీసులు ముందస్తుగా విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. ముందస్తు అరెస్ట్ లపై ఓయూ విద్యార్థులు భగ్గుమన్నారు. క్యాంపస్ కి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేశారు. ఎవరిని లోనికి అనుమతించడంలేదు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి. రోడ్లు నెత్తురోడుతున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. ఆ కారులో ఉన్ననలుగురిలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గాయాలపాలైన యువకుల్ని స్ధానికుల సహాయంతో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు ధృవీకరించారు వైద్యులు. మృతులు ఇద్దరు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కొత్తగూడెంకి చెందిన చైతన్య(26),ప్రణీత్(24)గా గుర్తించారు. గాయపడ్డవారు ఆస్పత్రిలో చికిత్ప అందుకుంటున్నారు. బాపట్ల సూర్యలంక బీచ్ నుండి కొత్తగూడెం వెళుతుండగా మైలవరం మండలం పుల్లూరు హైవేపై ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె- పుంగనూరు మార్గం ఓల్డ్ ఆర్‌టీఓ కార్యాలయం ఎదురుగా ఆటోను ఢీకొంది బెలేరో వాహనం…ఆటో డ్రైవర్ ప్రక్కన కూర్చున్న వెంకటేష్(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తాలూకా పోలీసులు.
వీడి డెడికేషన్ తగిలెయ్యా.. పోలీస్ ఆపరేషన్ మధ్య పార్సల్ ఇవ్వడం ఏంట్రా..వీడియో వైరల్
మామూలుగా ఏదైనా పోలీస్ ఆపరేషన్ జరుగుతుంటే జనాలు ఆ ప్రాంతం చుట్టువైపుల కూడా వెళ్లరు. అక్కడికి వెళ్తే ఎలాంటి సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఓ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ మాత్రం ఇలాంటి పరిస్థితుల మధ్య తన వృత్తి ధర్మాన్ని పాటించాడు. పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో కూడా పార్సిల్ ఇచ్చేందుకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలు దీనిపై వార్తల్ని ప్రసారం చేశాయి.నార్త్ కరోలినాలోని ఓ ప్రాంతంలో పోలీసులు ఓ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ ప్రాంతంలో ఓ పార్సిల్ ను డెలివరీ చేయడానికి ఓ వ్యక్తి వెళ్లి పార్సల్ ను అందించాడు. నార్త్ కరోలినా క్యారీలో గత నెలలో ఈ ఘటన జరిగింది. ‘‘మీరు మీ వ్యాపారంలో ఉన్నప్పుడు ఏదీ మీ దారికి అడ్డురాదు’’ అనే క్యాప్షన్ తో ఈ వీడియో వైరల్ అవుతోంది. పోలీస్ స్టాండ్ఆఫ్ కొనసాగుతున్న సమయంలో ఆ ప్రదేశానికి అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ వెళ్తున్నారు. అయితే అతడు పార్సిల్ అందించాల్సిన ఇంటికి చేరుకోలేకపోయాడు.. కానీ స్వాట్( స్పెషల్ వెపన్ అండ్ టాక్టిస్) సభ్యుడికి పార్సిల్ అందించాడు. డెలివరీ వ్యక్తి డెడికెషన్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోను చిత్రీకరించిన వ్యక్తి నవ్వూతూ చెబుతున్నాడు.