రణస్థలంలో యువశక్తి సభకు అంతా రెడీ
శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో యువశక్తి సభకు సర్వం సిద్దమైంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువశక్తి సభకు యువత తరలివస్తోంది. పవన్ కళ్యాణ్ సభ కోసం 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో ఏర్పాట్లు చేసారు. పవన్ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణంలోనే ఉండనున్నారు. మరోవైపు సభా వేదికపై యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పలు రాజకీయ తీర్మానాలు చేస్తారని జనసేన నేతలు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస పంచాయితీ పరిధిలో 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో పవన్ సభ నిర్వహిస్తున్నారు. రణస్దలం సమీపంలో యువశక్తి పేరిట నిర్వహిస్తున్న ఈ సభను జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేసారు. సభా ప్రాంగణానికి వచ్చే నాలుగు గేట్లకు ఉత్తరాంద్ర యోధులైన గిడుగు రామ్మూర్తి పంతులు , వీరనారి గున్నమ్మ , కోడిరామ్మూర్తి నాయుడు, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు. పవన్ పర్యటన ఏర్పాట్లను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పవన్ సోదరుడు కొణిదెల నాగబాబు దగ్గరుండి పర్యవేక్షించారు.
నంద్యాలలో టెన్షన్.. కాసేపు నిలిచిన వీరసింహారెడ్డి మూవీ
నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే తెచ్చారు. నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ ఇవాళ విడుదలైంది. ఏపీలోని నంద్యాలలోని మిని ప్రతాప్ థియేటర్ లో వీరసింహారెడ్డి సినిమా కాసేపు నిలిచిపోయింది. తెల్లారి జామున 5 గంటలకే ప్రారంభమైంది సినిమా షో. వివిధ కారణాల వల్ల రెండు సార్లు 45 నిమిషాల పాటు సినిమా నిలిచిపోయింది. దీంతో బాలయ్య అభిమానుల్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. తర్వాత సినిమా యధావిధిగా కొనసాగింది. సాంకేతిక లోపాలే కారణమంటున్నారు థియేటర్ సిబ్బంది.నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో.. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య మూవీ అంటే యాక్షన్ మామూలుగా ఉండదు. ప్రి పండుగకు బాలయ్య మూవీ విడుదల కావడం రివాజు. 2021 డిసెంబర్ లో ‘అఖండ’తో తెలుగు సినిమాకు మళ్ళీ ఓ వెలుగు తీసుకు వచ్చారు. ఆ తరువాత బాలకృష్ణ నటించిన ఏ చిత్రమూ 2022లో ఏ మూవీ విడుదల కాలేదు. దాంతో బాలయ్య అభిమానులు ఆయన సినిమా కోసం అమితాసక్తితో ఎదురుచూస్తున్న సమయంలోనే 2023లో సంక్రాంతి కానుకగా ‘వీరసింహారెడ్డి’ చిత్రం జనం ముందు నిలచింది.
ఆ సిరప్‌లను ఉపయోగించొద్దు
నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను ఉజ్బెకిస్థాన్‌లోని పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసింది. మారియన్ బయోటెక్ తయారు చేసిన వైద్య ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలు అందుకోవడంలో విఫలమయ్యాయని.. అందువల్లే వాటిని ఉపయోగించొద్దని బుధవారం డబ్ల్యూహెచ్‌వో ఓ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన రెండు సిరప్‌లు ఆంబ్రోనాల్(AMBRONOL), డాక్-1 మాక్స్(DOK-1) సిరప్‌ల తయారీ నాణ్యత ప్రమాణాలు పాటించలేదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దగ్గు సిరప్ తాగి పిల్లలు చనిపోయారనే నివేదికలు వెలువడటంతో నోయిడాకు చెందిన ఫార్మా మారియన్ బయోటెక్ క్లౌడ్ కిందకు వచ్చింది. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలు నిర్వహించిన నాణ్య పరీక్షల్లో రెండు ఉత్పత్తుల్లో ఆమోదయోగ్యం కాని మొత్తంలో డైథైలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ గ్లైకాల్ కలుషితాలు ఉన్నట్లు కనుగొనబడింది.
ఆ క్షిపణులతో ఉక్రెయిన్‌కు ఈ ఏడాదే విజయం సిద్ధిస్తుంది!
పాశ్చాత్య శక్తులు ఆయుధాల సరఫరాను, ముఖ్యంగా సుదూర క్షిపణి వ్యవస్థలను పెంచినట్లయితే ఉక్రెయిన్ ఈ సంవత్సరం యుద్ధంలో విజయం సాధించగలదని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ బుధవారం వెల్లడించారు. 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగిన క్షిపణులు మాత్రమే దేశంలో ఆక్రమణల తొలగింపును వేగవంతం చేస్తాయన్నారు. ఈ దృష్టాంతంలో శరదృతువు నాటికి యుద్ధం ముగుస్తుందన్నారు. దీర్ఘ-శ్రేణి క్షిపణులు ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న రష్యన్ ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. యునైటెడ్ స్టేట్స్ గత సంవత్సరం ఉక్రెయిన్‌కు సుదూర శ్రేణి క్షిపణి వ్యవస్థలను సరఫరా చేసింది. ఇవి దాదాపు 80 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉన్నాయి. ఇవి ఉక్రెయిన్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఉక్రెయిన్ ఇటీవల ఫ్రాన్స్ నుంచి వివిధ ఆయుధాలను పొందింది. అయితే ఉక్రెయిన్ అమెరికాకు చెందిన ఏటీఏసీఎంస్ క్షిపణులను పంపిణీ చేయాలని వాషింగ్టన్‌పై ఒత్తిడి తెస్తోంది.
హైదరాబాద్ లో రెండో రోజు థాక్రే పర్యటన.. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీతో భేటీ
హైదరాబాద్ నేడు టి.కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే రెండో రోజు పర్యట కొనసాగుతుంది. ఇవాళ టి.కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తో భేటీ కానున్నారు. తర్వాత డీసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్స్ తో థాక్రే సమావేశం కానున్నారు. నిన్న అర్ధరాత్రి12 గంటల వరకు కొనసాగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. నాలుగున్నర గంటల పాటు సాగిన పీఏసీ సమావేశంలో నేతలకు సుతిమెత్తగా థాక్రే హెచ్చరించారు. నేతలంతా క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయండి.. TSPSC హైకోర్టు ఆర్డర్
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. అభ్యర్థి స్థానికత వివాదంపై TSPSC అప్పీల్‌ను హైకోర్టు విచారించింది మరియు వివాదంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతానికి గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదల చేయవచ్చని కోర్టు సూచించింది. వివాదం తర్వాత అభ్యర్థి స్థానికతను నిర్ణయిస్తామని కోర్టు స్పష్టం చేసింది.నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రధాన పాత్రలో.. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు రోజుల ముందే అభిమానులకు సంక్రాంతి పండుగను తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకు అనుమతి ఇవ్వడంతో తెల్లవారుజామున 4 గంటల నుంచే షోలు ప్రారంభమయ్యాయి. దీంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఓ రేంజ్ లో సాగింది. రాష్ట్రవ్యాప్తంగా వీరసింహారెడ్డి విడుదలైన థియేటర్ల వద్ద బాలకృష్ణ అభిమానులు సందడి చేశారు. మరోవైపు భాగ్యనగరంలో పలు థియేటర్ల వద్ద అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ వద్ద అభిమానుల సందడి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఫైర్ క్రాకర్లు, డప్పు వాయిద్యాలు, నృత్యాలు సందడి సృష్టించాయి. బాలయ్యబాబు, గోపీచంద్ మలినేనిలతో పాటు చిత్ర యూనిట్ అభిమానులతో కలిసి థియేటర్ వద్ద సందడి చేశారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని థియేటర్‌లో అభిమానుల మధ్య కూర్చుని సినిమా చూశారు.
మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్ టూర్.. కొనసాగుతున్న అరెస్టుల పర్వం
ముఖ్యమంత్రి ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేటకు బయలుదేరతారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి 10.15 గంటలకు హెలికాప్టర్‌లో మహబూబాబాద్‌కు బయలు దేరుతారు. గురువారం ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ హెలీప్యాడ్‌కు కేసీఆర్ చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం 11.40 నుండి 1.30 గంటల వరకు నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొంటారు.
శ్రీలంకతో నేడు రెండో వన్డే.. సిరీస్ పడతారా?
తొలి వన్డేలో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుని జోరుమీదున్న టీమిండియా నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో వన్డేలో శ్రీలంకతో తలపడనుంది. గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి. బ్యాటర్లు విరుచుకుపడడంతో తొలి మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి మళ్లీ అదే ప్రదర్శనను కనబరచాలని టీమిండియా భావిస్తుండగా.. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితి లంకది. భారత జట్టు ఫామ్‌ను చూస్తే బలంగా ఉంది. భారత జట్టును ఎదుర్కోవాలంటే లంక జట్టు సర్వశక్తులు ఒడ్డాల్సిందే. లంకజట్టు సమష్టి బాధ్యత కనబరిస్తేనే భారత జట్టును ఢీకొంటుంది. లేకుంటే గత మ్యాచ్ ఫలితం పునరావృతమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను పట్టేయాలని టీమిండియా భావిస్తోంది. మొదటి వన్డేలో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. తొలి వన్డేలో బ్యాటుతో అదరగొట్టిన కోహ్లీ 73వ అంతర్జాతీయ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాపార్డర్‌లో ముగ్గురు బ్యాటర్‌లో తమ బ్యాట్‌తో సమాధానం చెప్తే భారత్ విజయం నల్లేరుపై నడకే అని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. భారత టాపార్డర్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువ ఓపెనర్ శుభమన్ గిల్ వన్డే ఫామ్‌ను కొనసాగిస్తుండడంతో భారత్ టాప్ ఆర్డర్ కుదురుకున్నట్లే కనిపిస్తోంది.
అమెరికాకు భారత్ అభ్యర్థన
వ్యాపార వీసాల జారీని వేగవంతం చేయాలని భారతదేశం అమెరికాను అభ్యర్థించిందని, తద్వారా ప్రజలు తమ వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలను కొనసాగించేందుకు ప్రయాణాలను చేపట్టవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం తెలిపారు. వాషింగ్టన్‌లో జరిగిన 13వ ఇండియా-యూఎస్ ట్రేడ్ పాలసీ ఫోరమ్‌లో పాల్గొన్న అనంతరం మీడియా సమావేశంలో పీయూష్ గోయల్ మాట్లాడారు. “వాణిజ్యం, వ్యాపార ప్రయోజనాల కోసం చిన్న ప్రయాణాల కోసం వచ్చే సాధారణ వ్యాపార వీసాల జారీని వేగవంతం చేయాలని భారతదేశం యూఎస్‌కు అభ్యర్థన చేసింది” అని ఆయన చెప్పారు.
తెలుగువారికి గర్వకారణం … RRR టీంకి రామకృష్ణ అభినందనలు
Rrrgg
RRR టీంకి సీపీఐ నేత రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఇది తెలుగువారికి గర్వకారణం అని ప్రశంసించారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించడం అభినందనీయం.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మోషన్ పిక్చర్ కేటగిరీలో అవార్డు సాధించటం హర్షణీయం.ఈ అవార్డుతో తెలుగు చలనచిత్ర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికెక్కింది.ఇది తెలుగు వారికి గర్వకారణం.దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి, రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, నృత్య దర్శకులు, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు సీపీఐ నేత రామకృష్ణ. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానంలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. రెండు కేటగిరీల్లో అవార్డ్ కోసం పోటీ పడింది ఆర్ఆర్ఆర్. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు.. నాటు..’ నామినేట్ అయ్యింది.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ విన్ అయ్యింది. బెస్ట్ సాంగ్ గా నాటు నాటు సాంగ్ కు అవార్డు లభించిన సంగతి తెలిసిందే.