హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఒకరి అరెస్ట్
హైదరాబాద్ నగరంలో మరోసారి మాదక ద్రవ్యాలు కలకలం సృష్టించాయి. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్భంగా సిటీకి తరలిన డ్రగ్స్ ను పెద్ద ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సంక్రాంతి పండుగ టార్గెట్ గా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న మరో వ్యక్తిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారులో 180 గ్రాముల కొకైన్ ను తరలిస్తుండగా హయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన వ్యక్తి నగరంలో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. హయత్ నగర్ పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ విషయమై ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరా చేస్తుండగా నైజీరియన్ ను పట్టుకున్నామన్నారు. అతడి దగ్గరనుంచి 18 లక్షల రూపాయల విలువైన 178 గ్రాములు కొకైన్ స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు.. నైజీరియాకు చెందిన పెడ్లర్ బాడ్విన్ ఎఫియంగే.. వనస్థలిపురంలోని హుడా పార్క్ వద్ద తచ్చాడుతుండగా పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. ఇతను డ్రగ్స్ అమ్ముతున్నాడని సమాచారంతో అతడి గురించి వెతకడం ప్రారంభించామన్నారు. ఈ వ్యక్తి గ్రాము కొకైన్ పదివేల రూపాయలకు అమ్ముతున్నాడని.. బెంగళూరు నుంచి కొకన్ ని తీసుకువచ్చినట్టుగా విచారణలో తేలిందన్నారు.
హైదరాబాద్ లో కూలిన భవనం అంతస్తు.. శిథిలాల కింద ఇద్దరు కార్మికులు?
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం సంభవించింది. కూకట్ పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. పై అంతస్తులో శ్లాబ్ వేసేందుకు పనులు చేస్తుండగా అది కూలిపోయింది. స్లాబ్ కింద ఎవరైనా ఉన్నారేమోనని అనుమానిస్తున్నారు స్థానికులు… సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నారు. 4,5 వ అంతస్తుకు స్లాబ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది స్లాబ్…రెడీ మిక్స్ కింద ఇద్దరు కూలీలు చిక్కుకొని ఉంటారని తోటి కార్మికులు అంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ,రెస్క్యూ టీం,స్థానిక పోలీసులు శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? నిర్మాణంలో ఉన్న భవనం కింద ఎంతమంది ఉన్నారు అనేది అధికారులు ఆరాతీస్తున్నారు. నాణ్యతా లోపం వల్ల జరిగిందా? ఇంకా ఏమైనా కారణాలు వున్నాయా అనేది విచారిస్తున్నారు. పనికి వచ్చిన కార్మికుల వివరాలు సేకరిస్తున్నారు.
ఇలా చేస్తే మీ అందం రెట్టింపవుతుంది
చాలామంది అందం పెంచుకోవడానికి చాలా తాపత్రయపడతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే అందం విషయంలో మీరు సెంట్రాఫ్ అట్రాక్షన్ కావచ్చు. అరటిపండు గుజ్జుకు కాస్త తేనె, చెంచాడు నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసి చూడండి. పావుగంట ముగిశాక చేతిని కాస్త తడి చేసుకుంటూ రుద్ది, చల్లని నీటితో కడిగేయాలి. మీ ముఖం మీద వున్న మృతకణాలు తొలగడమే కాదు, చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. మీ ఇంట్లో కలబంద ఉంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు. పావుకప్పు కలబంద గుజ్జుకు బాదం నూనె కలిపి ముఖానికి, మెడకి రాయాలి. వీటిల్లోని విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. పావుగంట ఉంచుకుని కడిగేసుకుంటే చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. చిన్న బొప్పాయి ముక్క రెండు స్పూన్ల ఓట్స్, స్పూన్ పంచదార, కాస్త తేనె కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి. ముఖానికి, మెడకి పట్టించి ఐదునిముషాలు మర్ధన చేసి, కాసేపు వదిలేయాలి. తర్వాత రౌండ్ గా రుద్దుతూ కడిగేస్తే మీ ముఖంగా అందంగా మారుతుంది.
సమంత కోసం తపిస్తున్న ఫ్యాన్స్.. ఎన్నాళ్లయిందో బయట కనిపించి..
ఈ జనరేషన్స్ లో ‘సూపర్ స్టార్’ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్ ‘సమంతా’. హీరోల పక్కన నటించే దగ్గర నుంచి హీరో అవసరం లేకుండా తనే సినిమాని ముందుకి నడిపించే వరకూ కెరీర్ బిల్డ్ చేసుకున్న సమంతా గత కొంతకాలంగా ‘మయోసైటస్’తో బాధపడుతూ ఉంది. తన హెల్త్ గురించి రెగ్యులర్ గా సమంతా అప్డేట్స్ ఇస్తున్నా కూడా ఆమెని చూడకపోవడంతో ఫాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ‘మాయోసైటస్’ కారణంగానే ‘సిటడెల్’ వెబ్ సిరీస్ (Citadel) నుంచి కూడా సమంతా తప్పుకుందనే రూమర్స్ వినిపించాయి. అయితే అదేమీ లేదని జనవరి మూడో వారం నుంచి కమిట్ అయిన ప్రతి ప్రాజెక్ట్ షూటింగ్ లో సమంతా పాల్గొంటుందని సమంతా టీం క్లారిటీ ఇచ్చారు. అయితే సమంతా పబ్లిక్ అప్పిరెన్స్ ని పూర్తిగా అవాయిడ్ చెయ్యడంతో సామ్ ని ఫాన్స్ మిస్ అవుతున్నారు.
బార్ ఓనర్ పై దాడి చేసిన దోపిడీ దొంగలు.. రెండుకోట్లు లూటీ
హైదరాబాద్ నగరంలో దారి దోపిడీలు వణుకు పుట్టిస్తున్నాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో బార్ ఓనర్ పై దాడి చేసి దోపిడీ దొంగలు రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురంకు చెందిన వెంకట్రామి రెడ్డి అక్కడే ఓ రెండు వైన్స్‌లు, ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి బార్ మూసేసిన తర్వాత వచ్చిన కలెక్షన్ రూ.2కోట్లను బ్యాగులో పెట్టుకొని ఇంటికి బయల్దేరారు. వెంకట్రామిరెడ్డి, మరో వ్యక్తి కలిసి వెళ్తున్న బైకును దుండగులు అడ్డగించారు. ఈ దోపిడీలో జరిగిన పెనుగులాటలో బ్యాగ్ నుంచి రూ.25 లక్షలు కిందపడిపోయాయి. వాటిని వదిలేసి బ్యాగ్ లోని రూ.1.75 కోట్లను దోచుకుపోయారు. బాధితుడు వెంటనే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.కింద పడిన డబ్బును తీసుకుని వనస్థలిపురం పోలీసు స్టేషన కు వెళ్లి ఫిర్యాదు చేశాడు వెంకట్రామిరెడ్డి.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా పోలీసులు దోపిడీ జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. నగదు దొంగిలించిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వనస్థలిపురం చౌరస్తాలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు.
ఏపీలో సలహాదారులంతా రాజీనామా చేయాలి
ఏపీలో ప్రభుత్వ శాఖలకు సలహాదారులపై నియామకంపై ఇటీవల హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కూడా ఏపీ ప్రభుత్వ సలహాదారులపై తీవ్ర విమర్శలు చేశారు. వీరు సలహాదారులు కాదని.. స్వాహాదారులు అని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల కంటే వీరు మంచి సలహాలు ఇస్తారా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు సలహదారుల వ్యవస్థ ఉపాధి హామీ పథకం వంటిదని చురకలు అంటించారు. సలహాదారుల పేరుతో జగన్ తన వాళ్లందరికీ ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకవైపు ఏపీ ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థ నానాటికీ దిగజారుతుంటే సలహాదారుల పేరుతో కోట్లాది రూపాయలను ఖర్చు చేయడం సరికాదని తులసిరెడ్డి హితవు పలికారు.
జైషే ఉగ్రసంస్థపై కేంద్రప్రభుత్వం నిషేధం
పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైష్-ఏ-మహ్మద్ ఉగ్ర సంస్థకు ప్రాక్సీగా వ్యవహరిస్తున్న ‘పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్’ (పీఏఎఫ్‌ఎఫ్)పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాద నిరోధక చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)చట్టం(యూఏపీఏ)-1967 కింద ఈ నిషేధం విధించింది. లష్కరే తోయిబా సబ్యుడు అర్బాజ్ అహ్మద్ మీర్ ను వ్యక్తిగత ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ లో పనిచేస్తున్న భద్రతా బలగాలు, రాజకీయ నాయకులు, పౌరులను పీఏఎఫ్‌ఎఫ్ బెదిరిస్తోందని హోంశాఖ తన నోటిఫికేషన్ లో పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ తో పాటు భారతదేశంలో ప్రధాన నగరాల్లో హింసాత్మక ఉగ్రవాద చర్యలు చేపట్టినందుకు, ఇతర ఉగ్ర సంస్థలతో కలిసి కుట్రలు పన్నుతుందని హోంశాఖ పేర్కొంది. తుపాకులు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను నిర్వహించడం శిక్షణ ఇవ్వడం, యువతను ఆకట్టుకుని రిక్రూట్, శిక్షణ ఇవ్వడం వంటి వాటికి పీఏఎఫ్‌ఎఫ్ పాల్పడుతోందని..భారతదేశంలో వివిధ ఉగ్రవాద చర్యలకు పాల్పడింది మంత్రిత్వ శాఖ తెలిపింది.
రిషబ్ పంత్ మోకాలి శస్త్ర చికిత్స విజయవంతం
రోడ్డుప్రమాదంలో గాయపడ్డ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. మెరుగైన చికిత్స కోసం ఇటీవల పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్ నుంచి ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పంత్ మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. కారు ప్రమాదంలో పంత్ మోకాలి లిగ్మెంట్ తెగిపోయినట్టు డెహ్రాడూన్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. దాంతో పంత్‌ను ముంబైకు ఎయిర్ లిఫ్ట్ చేశారు. శుక్రవారం నాడు పంత్ మోకాలికి ఆపరేషన్ జరిగిందని.. ఈ సర్జరీ విజయవంతమైందని ఈరోజు బీసీసీఐ వెల్లడించింది. కాగా రిషబ్ పంత్ పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. కనీసం 8 నుంచి 9 నెలల సమయం పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. దీంతో పంత్ ఐపీఎల్‌తో పాటు ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌కు సైతం దూరం అవుతాడనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పంత్ 8 నెలల తర్వాత కోలుకున్నా.. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయడానికి అతడికి మరింత టైం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతడు ఈ ఏడాదంతా క్రికెట్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.