మారుతున్న కృష్ణాజలాల రంగు.. ఆందోళనలో బెజవాడ జనం
బెజవాడ నగరాన్ని కాలుష్యం కమ్మేస్తుందా? మారుతున్న కృష్ణా జలాల రంగు వెనుక కారణం అదేనా? అంటే అవునంటున్నారు బెజవాడ వాసులు. ప్రమాదకర రసాయనాలతో కృష్ణ జలాలు కలుషితం అవుతున్నాయి…ప్రకాశం బ్యారేజ్ వద్ద పచ్చటి రంగులో రసాయనాలతో కూడిన ఒక పొర నీటిపై ఏర్పడింది..అదే నీరు ఏలూరు కాలువలో కూడా కలుస్తుంది….ఇక ఇప్పటికే కలుషితం అవుతున్న నీటితో నానా అవస్థలు పడుతున్నారు రూరర్ ఏరియా ప్రజలు.. కలుషితం అవుతున్న కృష్ణ జలాలను వాడుతున్న బెజవాడ వాసుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. బ్యారేజ్ వద్ద పచ్చటి రంగులో నీటిపై ఏర్పడిన పొర పరిస్థితిని ప్రమాదకరంగా మార్చేస్తోంది.ప్రమాదకర రసాయనాలు లేదా భారీగా పెయింట్ వెయ్యటంతో ఇలాంటి పొర ఏర్పడుతోందంటున్నారు. ఏలూరు కాలువలో కలుస్తున్న పచ్చటి పొరతో వున్న నీటిని చూసి ఏం జరుగుతుందో అర్థంకావడం లేదంటున్నారు. ఒక వైపు భవానీల స్నానాలు మరో పక్క పంటల సాగుకు వాడుతున్న కలుషిత నీరు కృష్ణా జలాల రంగుని మార్చేస్తున్నాయి.
కాపులు వైసీపీని నమ్మే పరిస్థితి లేదు
ఏపీలో త్వరలో జరగబోయే కాపునాడు సమావేశం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు కాపునాడుపై వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కాపు నేతల సమావేశం అంటూ వస‌్తున‌్న వార‌్తలు సరి కావు. ఇది సాధారణ సమావేశం మాత్రమే ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. ఓ వివాహానికి వచ్చిన సందర్బంగా మాత్రమే మేం కలిశాం. కుటుంబ వ్యవహారాలు, ఒకొరొకరి యోగక్షేమాలు మాత్రమే సమావేశంలో చర్చించుకున్నాం. వైజాగులో జరిగే కాపునాడు సమావేశంపై ఎటువంటి చర్చకు రాలేదు. 26వ తేదీన వైజాగులో రంగా వర్ధంతి పోస్టర్లు మాత్రమే గంటా ఆవిష్కరించారు. పార్టీ మారే అంశంపై గతంలోనే ఖండించానని గంటా చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ సైతం నాదెండ్ల మనోహర్ ఉన్న సంబంధాలు నేపథ్యంలోనే కలిశామని చెప్పారు. కాపునాడు అనేది ఏ ఒక్కొరికో సంబంధించిన అంశం కాదు.. అందిరితో కూడుకున్న అంశం. 26వ తేదీన రంగా వర్దంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. కాపు నాడు సభ కాదు. కాపులకు న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. 70 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో కాపు కార్పొరేషన్ పెట్టి కాపులకు న్యాయం చేసింది ఒక్క టీడీపీనే.
కాంగ్రెస్ తో కలిసి పోరాడాలని సీపీఐని కోరా
సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు వచ్చారు. ఆయనకు సాదర స్వాగతం పలికారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో గిడుగు భేటీ అయ్యారు. ఇరు పార్టీల నేతల మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కోసం పని చేస్తానన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కామన్ అజెండాతో పని చేశాయి. గతంలో అనేక అంశాల్లో కలిసి పని చేశాం. రామకృష్ణతో సహా అనేక మందితో విద్యార్థి దశలో కలిసి నడిచాం. భవిష్యత్ రాజకీయాలపై చర్చే తప్ప, ప్రణాళికలు ఏమీ లేవు. సీనియర్ నేతగా రామకృష్ణ సలహాలు, సూచనలు తీసుకుంటానన్నారు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. సమస్యలపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తి గిడుగు రుద్రరాజు.దేశ రాజకీయ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి.భావ సారూప్యత ఉన్న పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది.అతి పెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటాలు చేస్తాం.లౌకిక శక్తులను ఏకం చేసి బీజేపీని ఓడించాలని మా జాతీయ మహా సభల్లో తీర్మానం చేశాం.2024లో విభేదాలు పక్కన పెట్టి లౌకిక పార్టీలు కలవాలి.మోడీ మళ్లీ వస్తే రాజ్యాంగానికే ప్రమాదం వాటిల్లుతుందన్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థలో కీలక ఫైళ్ళు మాయం
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్..టౌన్ ప్లానింగ్..పారిశుధ్య..ప్రజారోగ్య విభాగాలకు చెందిన కొన్ని కీలక ఫైళ్ల మాయం కావడం కలకలం రేపుతోంది. ఆడిట్ అధికారుల పరిశీలనలో వెలుగు చూశాయి పలు కీలక విషయాలు. ఏ.సి.బి.అధికారులు తీసుకెళ్లారని చెబుతున్నారు కార్యాలయ సిబ్బంది. ఫైళ్ల మాయం పై కార్పొరేషన్ కమిషనర్ హరిత సీరియస్ అవుతున్నారు. కొందరు అధికారులు..ఉద్యోగులకు షోకాజ్ నోటీసుల జారీచేశారు. వాటి గురించి సమాచారం వెంటనే తనకు అందచేయాలని ఆమె ఆదేశించారు.
లారీ తాడే ఉరితాడైంది..అదృష్టంగా బయటపడ్డ బైకర్
ఆవగింజంత అదృష్టం ఉన్నా చాలు ఎంతటి విపత్తుల నుంచైనా తప్పించుకోవచ్చు. ఎలాంటి ప్రమాదాల్లో అయినా సురక్షితంగా ఉండొచ్చు. సరిగ్గా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. తమిళనాడు తూత్తుకుడిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అద్భుతరీతిలో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే తూత్తుకూడిలో ఎదురెదురుగా లారీ, బైకు వస్తున్న క్రమంలో లారీకి వేలాడుతున్న తాడు యువకుడి మెడకు చుట్టుకుంది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. అయితే అదృష్టం కొద్దీ బైకర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. తూత్తుకూడి జిల్లా శ్రీవైకుంఠం పట్టణానికి చెందిన ముత్తు అనే యువకుడు బైక్ పై వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా ఓ లారీ వస్తోంది. ఏరల్ ప్రాంతం దాటుతుండగా.. అకస్మాత్తుగా లారీకి ఉన్న తాడు ముత్తు మెడకు చుట్టుకుంది. దీంతో ఒక్కసారిగా ముత్తు బైకు పై నుంచి గాలిలోకి ఎగురుతూ రోడ్డుపై పడిపోయాడు. అతని మెడకు తాడు మరింతగా చుట్టుకోకుండా వెంటనే చుట్టుపక్కల ఉన్నవారంతా సహాయం చేశారు. దీంతో స్వల్పగాయాలతో యువకుడు బయటపడ్డాడు. ఏ మాత్రం అటూఇటూ అయినా లారీకి వెళాడుతున్న తాడే.. ముత్తుకు ఉరితాడు అయ్యేది. ఘటన జరిగిన కొంత సమయం వరకు స్పృహ కోల్పాయాడు. ఆ షాక్ నుంచి తేరుకుని తనకు ఏం జరిగిందో తెలుసుకునేందుకు రెండు నిమిషాలు పట్టింది.
విజయవాడలో విదేశీ ఉద్యోగాల పేరుతో టోకరా
నిరుద్యోగుల బలహీనతలను కొందరు కేటుగాళ్ళు, అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు తర్వాత బిచాణా ఎత్తేస్తున్నారు. విజయవాడలో విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేశారు. విజయవాడలో వెలుగు చూసిన డయల్ ఇనిస్టిట్యూషన్ మోసంపై బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. బందరు రోడ్డులో కార్యాలయం ఏర్పాటు చేసి నిరుద్యోగులకు వల వేశారు. ప్రభుత్వ, విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా వేశారు. వీటిని నమ్మిన వారు అడ్డంగా మోసపోయారు. ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షల వరకు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన 30 మంది బాధితులు, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోలీసుల అదుపులో ఇనిస్టిట్యూట్ యజమాని సిద్ధార్ధ్‌వర్మ వున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలల్లో బాధితులు ఉంటారని అంచనా వేస్తున్నారు పోలీసులు. అమెరికా, ఇంగ్లాడ్, దుబాయ్, మలేసియాలలో ఉద్యోగాలతో పాటు అనేక మాయమాటలు చెప్పారు. వీటితోపాటు దేశంలోని కార్గో, ఫుడ్‌కార్పోరేషన్, బీఎస్‌ఎన్‌ఎల్, నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు కేటుగాళ్లు.
సుగణ సుందరి సాంగ్ వచ్చేసింది.. బాలయ్యా మాస్ ఎనర్జీ
రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలకృష్ణ. ఆ జోనర్‌లో ఆయన తీసిన సినిమాలు సంచలన విజయాలు అందుకున్నాయి. అలాంటి నేపథ్య కథతో ఆయన చేసిన మరో సినిమా ‘వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి బ్యానర్‌పై నిర్మించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ, అందాల బామ శృతి హాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డిలోని సుగుణ సుందరి పాట విడుదలైంది. ఈ పాటలో బాలకృష్ణ యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తుండగా, శృతి హాసన్ మల్టీ కలర్ డ్రెస్ లో ఆకట్టుకుంది. ఈ డ్యూయెట్‌లో లీడ్ పెయిర్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించారు. మొదటి పాట ‘జై బాలయ్య’ మాస్ నంబర్ అయితే, రెండోది సుగుణ సుందరితో డ్యూయెట్. ఇక, ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిషి పంజాబీ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్‌గా పనిచేస్తున్నారు.త్వరలో చివరి పాట చిత్రీకరణతో చిత్రీకరణను పూర్తి చేయనున్నారు మేకర్స్.