నేడు మహారాష్ట్రలో BRS భారీ బహిరంగ సభ

బీఆర్‌ఎస్ పార్టీ నేడు మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. లోహా నియోజకవర్గంలోని నాందేడ్‌లో నిర్వహించే ఈ సభకు ఎక్కువ మంది హాజరయ్యేలా పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశారు. ఈ బహిరంగ సభకు పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ సమావేశం జరగడం ఇది రెండోసారి. అక్కడ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను దేశవ్యాప్తంగా, అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే అన్ని రాష్ర్టాల నేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలతో పాటు ఛత్రపతి శివాజీ వారసులైన నేతలు కూడా ముందుకు వచ్చారు. తెలంగాణకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర గ్రామాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ మొదట మహారాష్ట్రలో తమ పార్టీ కార్యక్రమాల విస్తరణ వైపుగా అడుగులు వేస్తున్నారు.
దేశంలో కరోనా విజృంభణ.. 5నెలల గరిష్టానికి కేసులు

దేశంలో కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేసుల సంఖ్య కేవలం వందల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తాజాగా 5 నెలల గరిష్టానికి రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,890 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళలో ముగ్గురు మరణించారు. చివరిసారిగా గతేడాది ఒకే రోజు 2,208 కేసులు నమోదు కాగా.. దాదాపుగా 149 రోజుల తర్వాత 1,890 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,433గా ఉంది. డైలీ పాజిటివిటీ రేట్ 1.56 శాతంగా నమోదు అయింది. వీక్లీ పాజిటివిటీ రేట్ 1.29 శాతంగా ఉంది. దేశంలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.47 కోట్లు(4,47,04,147)గా కేసులు నమోదు అయ్యాయి. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య ,41,63,883కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ ద్వారా 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించింది.
రాష్ట్రంలో ఇసుక.. మట్టి… సిలికా..గనుల దోపిడీ

నెల్లూరు జిల్లాలో బి.జె.పి.రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై అహంకారపూరిత ఆలోచనతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కాంగ్రెస్ పాలనలో దేశం దివాలా తీసింది. దేశంలో అవినీతి రహిత పాలనను మోడీ అందిస్తున్నారు.రాష్ట్రంలో ఇసుక.. మట్టి. సిలికా. గనుల దోపిడీ జరుగుతోంది. అధికారులతో కలిసి అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారు. కృష్ణ. గోదావరి తో పాటు నదుల్లో ఇసుకను యంత్రాల ద్వారా తవ్వుతున్నారు. ఈ విషయంలో మార్పు రాకపోతే రీచ్ ల వద్దకు బిజెపి నేతలు వెళ్లి ఆందోళన చేస్తారు. క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికాదు. కొన్ని చర్చిలకు విలువైన భూములను కట్టబెడుతున్నారు. రాష్ట్రాన్ని మతరాజ్యం చేయకుండా బిజెపి పోరాటం చేస్తుందన్నారు సోము వీర్రాజు.
నన్ను ఎందుకు వేధిస్తున్నారు?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమిపై అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పార్టీ సస్పెండ్ చేసింది. ఆమె క్రాస్ ఓటింగ్ చేశారని పార్టీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా ఆమె మీడియాకు అందుబాటులో లేకుండా పోయారు. తాజాగా ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల తీరు, పార్టీ నేతల విమర్శలపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన కామెంట్లు చేశారు. గత మూడు రోజులు గా వైసీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారు. నేను అజ్ఞాతంలో ఉన్నానని అంటున్నారు. మొన్న డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ లాగా నన్ను చంపుతారు అని అజ్ఞాతం లోకి వెళ్ళాను. వాళ్ళ దందాలకు నేను అడ్డు వస్తున్నాను అని ఇలా చేస్తున్నారు అన్నారు ఉండవల్లి శ్రీదేవి.నేను ఓటు వేసే టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా? లేదా సీసీ కెమెరా పెట్టారా?నేను ఓటు వేసే ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు. మిగతా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు అనుమానం పడట్లేదు. నన్ను ఎందుకు వేధిస్తున్నారు? నన్ను పిచ్చి కుక్క లాగా నిందవేసి బయటకు పంపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈనెల 28న టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ

ఈ నెల 28వ తేదీ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతోంది టీడీపీ.భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనుంది టీడీపీ. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు, ప్రజా పోరాటాలు, సంస్థాగత పటిష్టతపై కార్యాచరణ సిద్దం చేయనుంది టీడీపీ. తెలంగాణ ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై నిర్ణయం తీసుకోనుంది టీడీపీ. చాలా కాలం తరువాత హైదరాబాదులో పొలిట్ బ్యూరో మీటింగ్ జరగనుండడంతో ఏం చర్చిస్తారనేది హాట్ టాపిక్ అవుతోంది. మేలో జరిగే మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చ – తీర్మానాలు వుంటాయి. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మార్చి 29న హైదరాబాదులో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్సులో జరిగే సభకు హాజరు కానున్న రెండు రాష్ట్రాల టీడీపీ నేతలు. ఏపీ నుంచి సభకు వెళ్లనున్నారు పొలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జ్లు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పార్టీ ఆవిర్భావ సభకు వెళ్లనున్నారు క్లస్టర్ ఇంచార్జ్ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ నాయకులు.
ప్రతీది మర్చిపోతున్నారా.. మీకు అదే కావొచ్చు
ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, నిరంతర పని కారణంగా ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా, మీ జ్ఞాపకశక్తిని కూడా బలహీనపరుస్తుంది. దీంతో ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోవడం మొదలుపెడతాం. అలాంటి సందర్భాలలో జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని జయించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పని మధ్య విరామం తీసుకోవడం మాత్రమే సరిపోదు. ఇది కాకుండా, శరీరానికి అవసరమైన కొన్ని విటమిన్లు (పోషకాహారం), ఖనిజాలు కూడా అవసరం. ఆరోగ్యకరమైన రీతిలో విటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే పై సమస్యలను అధిగమించవచ్చు. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఏ విటమిన్లు మరియు ఖనిజాలు ఉపయోగపడతాయో తెలుసుకుందాం. మొలకలు, సిట్రస్ పండ్లు, బ్రోకలీ, బంగాళదుంపలు, స్ట్రాబెర్రీలు, కివి, ఎర్ర మిరియాలు, క్యాబేజీ, ఆకుకూరలు వంటి ఆహారాల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ ఇని సహజంగా కూడా తీసుకోవచ్చు. దీని కోసం మీరు మీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్, విత్తనాలు, తృణధాన్యాలు, వాల్‌నట్ ఆయిల్, గోధుమ గింజలు మరియు మొలకలు మొదలైన వాటిని తీసుకోవచ్చు
‘అమరావతికి అటు ఇటు’ దగ్గరే ఆగకపోవచ్చు…

అతడు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్స్ పెట్టిన సినిమాలు ఇవి. త్రివిక్రమ్ నుంచి సినిమా వస్తుంది అనగానే హీరో ఎవరు అనేదాని కన్నా ముందు ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్ ఉంటుంది అనే క్లారిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న మూడో సినిమాకి కూడా ‘అ, ఆ’ అక్షరాల్లో ఒక దానితో టైటిల్ పెట్టి ఉంటాడని సినీ అభిమానులు భావిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాకి త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్ ఫాలో అవుతూ… అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు.. లాంటి టైటిల్స్ ఫిక్స్ చేసి ఉంటాడు, ఈ ఉగాదికి టైటిల్ అనౌన్స్ చేసి SSMB 28 ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేస్తారని ఘట్టమనేని ఫాన్స్ ఆశించారు కానీ అది జరగలేదు. ఫస్ట్ లుక్, టైటిల్, గ్లిమ్ప్స్ లే కాదు కనీసం పలానా టైంలో SSMB 28 అప్డేట్ వస్తుంది అనే అనౌన్స్మెంట్ కూడా చిత్ర యూనిట్ నుంచి బయటకి రాలేదు. ఇందుకు కారణం SSMB 28 సినిమాకి టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వకపోవడమే అని తెలుస్తోంది. అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం అనే టైటిల్స్ ని త్రివిక్రమ్ పరిశీలిస్తున్నాడట.
RC 15 సెట్స్ లో మెగా పవర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్

మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ తేజ్. అతి తక్కువ కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న చరణ్, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తండ్రిని మించిన తనయుడిగా కాంప్లిమెంట్స్ అందుకుంటున్నాడు. గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్ మార్చ్ 27న పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. తన 38వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ లో భారి బడ్జట్ సినిమా చేస్తున్న చరణ్, ఈ మూవీ సెట్స్ లో తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. శంకర్, కియారా అద్వానీ, ప్రభుదేవా, గణేష్ మాస్టర్, దిల్ రాజులతో పాటు కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి రామ్ చరణ్ బర్త్ డేని సెలబ్రేట్ చేశారు. హైదరాబాద్ లో కియారా అద్వానీ, రామ్ చరణ్ పైన ప్రభుదేవా మాస్టర్ డిజైన్ చేసిన సాంగ్ షూట్ చేస్తున్న చిత్ర యూనిట్, ఈ సాంగ్ షూటింగ్ స్పాట్ లో చరణ్ తో కేక్ కట్ చేయించారు.