‘జిందగీ నా మిలేగీ దుబారా’… హృతిక్, అభయ్ డియోల్, ఫర్హాన్ అఖ్తర్ నటించిన మల్టీ స్టారర్. అంతే కాదు, జోయా అఖ్తర్ తన దర్శకత్వ ప్రతిభతో అందర్నీ ఆకట్టుకున్న సినిమా. అయితే, ఈ సినిమా గురించిన ఒక బిహైండ్ ద సీన్స్ వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో చర్చగా మారింది. ‘జిందగీ నా మిలేగీ దుబారా’ మేకింగ్ సమయంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ నటుడు అభయ్ డియోల్ ‘ఒక సీరియస్ బట్ ఫన్నీ ఇన్సిడెంట్’ వివరించాడు.
కథలో భాగంగా హృతిక్ కార్ డ్రైవ్ చేయాలి. అంతలోనే రోడ్డు పక్కకు వాహనాన్ని తీసుకు వచ్చి పార్క్ చేయాలి. కిందకు దిగాలి. అయితే, ఆ సమయంలో కార్ వెనుక భాగంలో ఫర్హాన్, అభయ్ ఉంటారు. ఇదంతా బాగానే ఉన్నా హృతిక్ కారు పక్కకు ఆపి కిందకు దిగేటప్పుడు ఇంజన్ ఆఫ్ చేయటం మరిచాడట. దాంతో వాహనం ముందుకు వెళ్లిపోవటం మొదలు పెట్టింది. లోపల కూర్చున్న ఫర్హాన్, అభయ్ బెంబేలెత్తిపోయారు. అయితే, అంతలోనే హృతిక్ తిరిగి కార్ లోకి జంప్ చేసి ‘ఆఫ్’ చేశాడట! దాంతో ప్రాణ గండం తప్పింది ఫర్హాన్, అభయ్ లకి! ఈ మొత్తం తంతు అంతా జరుగుతుండగా కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియోని ఇప్పుడు జోయా అఖ్తర్ స్వంత బ్యానర్ ‘టైగర్ బేబీ ఫిల్మ్స్’ అఫీషియల్ అకౌంట్లో షేర్ చేశారు.