అందాల కథానాయిక పూర్ణ, అర్జున్ అంబటి, రాకేందు మౌళి ప్రధాన పాత్రదారులుగా కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మిస్తోన్న’సుందరి’ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. దీనికి సెన్సార్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ, ”నాకు మాస్ హీరో సెంట్రిక్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. లాక్డౌన్ టైంలో ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చెయ్యాలని అనుకున్నాను. అప్పుడు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యాను. అలా ‘సుందరి’ కథను తయారు చేశాను. స్టోరీ లైన్ వినగానే రిజ్వాన్ వెంటనే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నారు. ఒక చిన్న థ్రెడ్ మీద సినిమా అంతా రన్ అవుతుంది. సురేష్ బొబ్బిలి ఎక్స్ట్రార్డినరీ ట్యూన్స్ ఇచ్చారు. తన రీ-రికార్డింగ్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్స్ కి తీసుకెళ్లారు. బాల్ రెడ్డి తన కెమెరా మ్యాజిక్ తో, క్వాలిటీ మిస్ అవకుండా ప్రతీ ఫ్రెమ్ ని అందంగా తీర్చిదిద్దాడు. ఎడిటర్ మణికాంత్ చాలా బాగా ఎడిట్ చేసి మంచి సపోర్ట్ చేసాడు. రాకేందు మౌళి సూపర్బ్ గా నటించి.. ఒక రెండు బ్యూటిఫుల్ లిరిక్స్ రాశాడు. ఫైనల్ గా మా ‘సుందరి’ పూర్ణ గారు ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు” అన్నారు.
చిత్ర నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. ”సుందరి క్యారెక్టర్లో పూర్ణ అద్భుతంగా నటించింది. ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అయింది. ప్రతీ సీన్ సింగిల్ టేక్ లో చేసి మా యూనిట్ అందర్నీ ఆశ్చర్య పరిచింది. అర్జున్ చాలా బాగా నటించాడు. ఇద్దరూ వారి పాత్రలకు ప్రాణం పోశారు. దర్శకుడు కళ్యాణ్ కథ చెప్పిన దానికన్నా బ్రహ్మాండంగా సినిమాని తెరకెక్కించాడు. అతి త్వరలోనే థియేటర్లలో దీనిని విడుదల చేస్తాం” అని తెలిపారు.
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. ”ఒక విలేజ్ లో ఉండే డీసెంట్, ఇన్నోసెంట్ అమ్మాయి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నది ఈ చిత్ర కథాంశం. నాకు ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది. ప్రస్తుతం ఈ మోడరన్ యుగంలో చాలా మంది అమ్మాయిల లైఫ్ లో జరిగిన స్టోరీ ఇది. అర్జున్ తో యాక్ట్ చేయడం చాలా కంఫర్ట్ గా ఫీలయ్యాను. మా కాంబినేషన్లో వచ్చే సీన్స్ సప్రయిజింగ్ గా ఉంటాయి. క్లైమాక్స్ లో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అది చాలా హైలెట్ అవుతుంది. రాకేందు మౌళి ఎక్స్ లెంట్ గా చేశాడు. సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నాను” అని చెప్పారు.