దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన మొదటి అప్డేట్ కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందనే స్టేట్మెంట్ తో మరింత ఖుషీ అవుతున్నారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, చరణ్ ఒకే బైక్‌పై వెళ్తోన్న ఓ ఫొటోను విడుదల చేశారు. చిరునవ్వులు చిందిస్తూ వారిద్దరు ఉన్న ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది.
Also read: విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’ సెన్సార్ పూర్తి
అయితే పోస్టర్ ఇలా వచ్చిందో లేదో.. అప్పుడే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రాజమౌళి టీమ్ కి గ్రాఫిక్స్ పని ఇంకా మిగిలి ఉందనే సంకేతం వచ్చేలా ఎడిటింగ్ చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సిటీ ట్రాఫిక్ పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి వారు ఏ అవకాశం దొరికిన ఆలోచింపచేసేలా సోషల్ మీడియాలోనూ పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఎన్టీఆర్, చరణ్ బైక్ పోస్టర్ కి హెల్మెట్ జోడించారు. హెల్మెట్ ధరించాక పోస్టర్ పర్ఫెక్ట్ గా ఉందంటూ కామెంట్ చేశారు. ‘హెల్మెంట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి’ అంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. కాగా ట్రాఫిక్ పోలీసులు చేసిన పనితీరు అందరిని ఆకట్టుకోవటంతో కామెంట్ల వర్షం కురుస్తోంది. మరి దీనిపై చిత్రబృందం కూడా ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి!
Now it is perfect.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 29, 2021
Wear Helmet. Be Safe.@RakeshGoudE @tarak9999 @AlwaysRamCharan @RRRMovie @ssrajamouli @DVVMovies #RRRMovie #JrNTR #RamCharan pic.twitter.com/LDa20NYxCg