మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీలోని ‘లాహే… ‘ పాటను అత్యద్భుతంగా పాడారు హారిక నారాయణ, సాహితీ చాగంటి. వీరిద్దరూ ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ ప్రోగ్రామ్ కు ఈ వారం గెస్టులుగా హాజరయ్యారు. వీళ్ళు క్యూట్ అండ్ స్వీట్ మాత్రమే కాదు… కాస్తంత తింగరబుచ్చీలు కూడా అంటూ వాళ్ళతో చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న సాకేత్… ఫన్నీగా పరిచయం చేశాడు. విశేషం ఏమంటే… ‘లాహే… ‘ పాట పాడినప్పటి నుండీ ‘లాహే సిస్టర్స్’ గా గుర్తింపు తెచ్చుకున్న వీళ్ళకు, మరో నిక్ నేమ్ కూడా ఉంది, అదే ‘లస్సీ’! దాని అబ్రివేషన్ వెనక ఉన్న కథను వాళ్ళ మాటల్లోనే వినాలి!! ఇక పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ బ్యూటిఫుల్ సింగర్స్ కు పెట్టిన నిక్ నేమ్స్ ను సాకేత్ ఈ షోలో వాళ్ళతోనే రివీల్ చేయించాడు. సాహితిని పొట్టిని ఓ సంగీత దర్శకుడు ముద్దుగా పిలిస్తే.. హారికను మరో సంగీత దర్శకుడు మైక్ స్టాండ్ అని పిలవడం విశేషం.
ఈ క్యూట్ సింగర్స్ కు సంబంధించిన బోలెడన్ని విశేషాలను సాకేత్ వ్యూవర్స్ కు ఈ ఎపిసోడ్ లో తెలియచేశాడు… హారిక మెడలో ఉండే రుద్రాక్షమాల వెనుక రహస్యం, సాహితీ పిన్న వయసు నుండే పాటలు పాడటం వెనుక ఉన్న సపోర్ట్… మణిశర్మ మహతి రికార్డింగ్ థియేటర్ తో ఈ సింగర్స్ కు ఉన్న అనుబంధం… ఇలాంటి రేర్ ఇన్ఫర్మేషన్ ను వాళ్ళ నుండి సాకేత్ రాబట్టాడు. అంతేకాదు… వాళ్లతో ‘లాహే… ‘ పాటను లైవ్ లో పాడించడం ఈ షోకి సంబంధించి మరో హైలైట్. ఫోటోలను చూసి, పాటను గుర్తు పట్టే ఎపిసోడ్ లో సాహితి తన బుర్రను ఉపయోగించి… మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత టంగ్ ట్విస్టర్ లో మాత్రం ఇద్దరు సింగర్స్ తో సాకేత్ ‘షకీలా’ తాగించేశాడు. లాస్ట్ రౌండ్… ర్యాపిడ్ ఫైర్ లో సింగర్స్ ను ఆర్డర్ లో పెట్టమన్నప్పుడు మనవాళ్ళిద్దరూ గట్టి కసరత్తే చేశారు. ఇక రాగంలో అయినా
చక్కగా పాడగలితే ఈ అందాల భామలు జనరల్ నాలెడ్జ్ లో మాత్రం వీక్ అని నిరూపించుకున్నారు. జాతీయ గీతం రచయిత పేరు చెప్పడంలో సాహితి, దేశ ప్రధాన మంత్రి పేరు చెప్పడంలో హారిక తడబడ్డారు. మొత్తం మీద… ఈ బ్యూటిఫుల్ సింగర్స్ ఇద్దరూ కూడా హుషారు గా షోలో పార్టిసిపేట్ చేసి… చూసే వాళ్ళకు ఫుల్ కిక్ ఇచ్చారు… మరి ఇక ఆలస్యం ఎందుకూ… మీరూ లాఫింగ్ రైడ్ లా సాగిన ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ చూసి… ఎంజాయ్ చేసేయండి!!