కాజల్ అగర్వాల్ పెళ్ళి గత యేడాది అక్టోబర్ 30 గౌతమ్ కిచ్లూతో జరిగిన విషయం తెలిసిందే! ఈ సందర్భంగా ఆమెకు లక్షలాది మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ చెప్పిన వెడ్డింగ్ విషెస్ ను కాజల్ చాలా లైట్ తీసుకోవడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే.. కాజల్ కాంటెంపరరీ హీరోయిన్ అనుష్క!
అక్టోబర్ 30న కాజల్ పెళ్లి కాగానే, ఆ విషయం తెలిసి అనుష్క ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్ చేసింది. చిత్రం ఏమంటే.. ఏడు నెలల తర్వాత కాజల్ ఆ ట్వీట్ కు లవ్ ఎమోజీస్ తో థ్యాంక్స్ తెలిపింది. నిజానికి బాగా ఆలస్యం అయింది కాబట్టి, కాజల్ రిప్లయ్ ఇవ్వకుండా ఉంటే బెటర్ గా ఉండేది. ఒకవేళ తాను ఆ మెసేజ్ ను చూడగానే అనుష్కకే పర్సనల్ గా ఆ విషయం చెప్పి ఉంటే బాగుండేది. ఆ పని చేయకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో స్పందించే సరికీ అనుష్క ను కాజల్ లైట్ తీసుకుందని కొందరు, ఎంత పెళ్ళి అయితే మాత్రం అంత తీరిక లేకుండా కాజల్ ఉందా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇంకొందరైతే… 39 సంవత్సరాలు వచ్చినా అనుష్క ఇంకా పెళ్లి చేసుకోలేదు… కాబట్టి ఖాళీగా ఉంటుంది. కానీ ఇక్కడ కాజల్ పెళ్ళి, హనీమూన్, సినిమాల్లో నటనతో క్షణం తీరిక లేకుండా ఉంది. సో.. అందుకే ఆ మాత్రం ఆలస్యం అయిందని ఆమెను వెనకేసుకు వస్తున్నారు. ఇంకొందరైతే… అది అనుష్క అధికారిక ఖాతానా కాదా అనేది కాజల్ కు తెలియదు, దానిని నిర్ధారించుకుని ఇప్పటికి సందేశం ఇచ్చిందని కాజల్ పై గుర్రుగా ఉన్న వారిని సముదాయిస్తున్నారు… మొత్తానికి కాజల్ పెట్టిన మూడే మూడు లవ్ ఎమోజిస్ ఎంతపని చేశాయి!?